ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ్రెండ్స్‌తో పాటూ Birthday వేడుకకు వెళ్లింది.. అందరితో సరదాగా గడిపి.. ఇంటికొచ్చి మొబైల్‌ చూసుకుని షాక్...

ABN, First Publish Date - 2022-07-11T02:31:35+05:30

‌స్నేహితుల కోసం త్యాగాలు చేసే వారు ఉన్న ఈ సమాజంలో.. అదే స్నేహం పేరుతో దారుణాలు చేసేవారు కూడా చాలా మంది ఉన్నారు. పైకి స్నేహంగా ఉంటూ లోలోపల కుట్రపన్నుతూ..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‌స్నేహితుల కోసం త్యాగాలు చేసే వారు ఉన్న ఈ సమాజంలో.. అదే స్నేహం పేరుతో దారుణాలు చేసేవారు కూడా చాలా మంది ఉన్నారు. పైకి స్నేహంగా ఉంటూ లోలోపల కుట్రపన్నుతూ ఉంటారు. తీరా సమయం రాగానే వారిలోని శాడిస్టులు బయటపడుతుంటారు. తమిళనాడులో ఇలాగే జరిగింది. ఫ్రెండ్స్ పిలవడంతో ఓ బాలిక Birthday వేడుకకు వెళ్లింది. అక్కడ ఫొటోలు దిగి, అందరితో సరదాగా గడిపింది. అయితే ఇంటికొచ్చి మొబైల్ చూసుకుని షాక్ అయింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...


తమిళనాడులోని కడలూరు జిల్లా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న 14ఏళ్ల బాలిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. అదే ప్రాంతంలో 12వ తరగతి చదువుతున్న 17ఏళ్ల బాలుడు ఆమెతో సన్నిహితంగా ఉండేవాడు. ఇదిలావుండగా, మే 22న బాలుడి పుట్టిన రోజు కావడంతో కార్యక్రమం నిర్వహించాడు. అతడి ఆహ్వానం మేరకు బాలిక, మరి కొంతమంది స్నేహితులు పార్టీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్నేహితులతో సన్నిహితంగా ఫొటోలు దిగి, అందరితో సరదాగా గడిపింది. అయితే ఇంటికి రాగానే ఆమె మొబైల్‌లో పార్టీలో దిగిన ఫొటోలు దర్శనమిచ్చాయి. వాటిని మార్పింగ్ చేసిన స్నేహితులు.. తాము చెప్పినట్లు వింటే ఫొటోలు తొలగిస్తామని బెదిరించారు.

నా తల్లినే కొడతారా! అంటూ ఏడుస్తూనే... ఎదురుతిరిగిన మూడేళ్ల బుడ్డోడు.. ఇంతకీ ఏం జరిగిందంటే..


ఈ క్రమంలో జూలై1న ముగ్గురు విద్యార్థులు బాలికను.. వారి ఇంటికి పిలిపించుకుని అత్యాచారం చేశారు. ఆ సమయంలో వీడియోలు తీసి, మిగతా స్నేహితులకు కూడా పంపించారు. దీంతో మరికొంత మంది స్నేహితులు.. ఆమెను వీడియోలు చూపించి వేధించేవారు. రోజు రోజుకూ వేధింపులు ఎక్కువవడంతో గురువారం తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. చెన్నైలో పనిచేస్తున్న 12వ తరగతి బాలుడిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి, జువైనల్ హోంకు తరలించారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రియుడితో ఉన్న కూతురిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న తల్లి.. 18ఏళ్లు నిండగానే పెళ్లి చేసుకుంటానని యువకుడు చెప్పడంతో.. చివరకు...

Updated Date - 2022-07-11T02:31:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising