ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీ కూతురు ఉరి వేసుకుందంటూ.. తల్లిదండ్రులకు స్థానికుల నుంచి ఫోన్.. పోలీసు విచారణలో వెలుగులోకి వచ్చిన అసలు నిజం..

ABN, First Publish Date - 2022-07-03T02:38:16+05:30

వివాహేతర సంబంధాలు.. చివరకు వినాశనానికి దారి తీస్తాయని తెలిసినా.. చాలా మంది తప్పు మీద తప్పులు చేస్తుంటారు. చివరకు జ్ఞానోదయం కలిగినా.. అప్పటికే జరగాల్సిన నష్టం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వివాహేతర సంబంధాలు.. చివరకు వినాశనానికి దారి తీస్తాయని తెలిసినా.. చాలా మంది తప్పు మీద తప్పులు చేస్తుంటారు. చివరకు జ్ఞానోదయం కలిగినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగుంటుంది. భర్తకు తెలీకుండా భార్య, భార్యకు తెలీకుండా భర్త తప్పులు చేసి, చివరకు జైలుపాలవడం.. రోజూ చూస్తూనే ఉన్నాం. తాజాగా, బీహార్‌లో విషాధ ఘటన చోటు చేసుకుంది. మీ కూతురు ఉరి వేసుకుందంటూ... ఆమె తల్లిదండ్రులకు స్థానికులు ఫోన్ చేశారు. చివరకు పోలీసుల విచారణలో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే..


బీహార్ రాష్ట్రం ఔరంగాబాద్ పరిధి మలుకి బిఘా అనే గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన విరాజ్ రామ్, రాణి(20) దంపతులు. వివాహమైన కొత్తలో వీరి మధ్య ఎలాంటి సమస్యలూ లేవు. అయితే రాను రాను భర్త ప్రవర్తనలో మార్పు వచ్చింది. భార్యను కాదని వేరే మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. కొన్నాళ్లకు ఈ విషయం భార్యకు తెలిసింది. దీంతో రోజూ ఈ విషయమై వారి మధ్య గొడవలు జరుగుతుండేవి. అయినా భర్త ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు. గత శుక్రవారం రాత్రి కూడా దంపతుల మధ్య గొడవ పెద్దదైంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త.. ఆమెను గొంతు నులిమి చంపేశాడు.

మీ భార్య మెట్లపై నుంచి జారి పడింది.. అంటూ స్థానికుల నుంచి ఫోన్.. భర్త కంగారుగా ఇంటికి వెళ్లి చూసేసరికి..


తర్వాత భార్యను ఉరికి వేలాడదీసి, అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు గమనించి రాణి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న రాణి తల్లిదండ్రులు, సోదరుడు.. రాణి మృతదేహంపై పడి బోరున విలపించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విచారణలో భర్త చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసుకుని వివాహిత అత్త, ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. విరాజ్ రామ్ కోసం గాలిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక రాగానే.. తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.

పిల్లలను ఆస్పత్రి వద్ద వదిలి.. ప్రియుడితో వెళ్లిన తల్లి.. తండ్రి కూడా ఎంతకీ రాకపోవడంతో.. పాపం చివరకు చిన్నారుల పరిస్థితి..

Updated Date - 2022-07-03T02:38:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising