రోడ్డుపై ఎదురు చూస్తున్నా తొందరగా వచ్చేయ్.. అని భార్యకు పోన్ చేశాడు.. తీరా దగ్గరికి వచ్చాక.. అంతా చూస్తుండగా ఒక్కసారిగా..
ABN, First Publish Date - 2022-07-06T22:19:52+05:30
ఎంతో మంది మహిళలు.. భర్త పెట్టే చిత్రహింసలను లోలోపలే భరిస్తుంటారు. ఇంకొందరు ఇంట్లో సమస్యలను ఇటు బయటికి చెప్పుకోలేక.. అటు భరించలేక.. చివరికి ఆత్మహత్యలు చేసుకోవడం...
ఎంతో మంది మహిళలు.. భర్త పెట్టే చిత్రహింసలను లోలోపలే భరిస్తుంటారు. ఇంకొందరు ఇంట్లో సమస్యలను ఇటు బయటికి చెప్పుకోలేక.. అటు భరించలేక.. చివరికి ఆత్మహత్యలు చేసుకోవడం కూడా తరచూ చూస్తున్నాం. మరికొందరు మహిళలు.. ఇలాంటి భర్త తనకు వద్దంటూ విడాకులు ఇచ్చేందుకు సిద్ధపడుతుంటారు. మధ్యప్రదేశ్‌లో ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. భర్తకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఓ రోజు భర్త ఫోన్ చేసి.. రోడ్డులోకి రమ్మన్నాడు. అక్కడ అంతా చూస్తుండగా అతడు చేసిన నిర్వాకం.. సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ పరిధి.. షాజిదా నగర్‌లో నివాసం ఉంటున్న ముస్కాన్ అనే యువతికి.. రాజస్థాన్‌లోని అలీగంజ్ ఛబ్రాకు చెందిన రయీస్ ఖాన్‌తో 2019 ఏప్రిల్‌లో వివాహమైంది. రయీస్.. స్థానికంగా హమాలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. వివాహమైన కొన్ని నెలలు బాగా చూసుకున్న భర్త.. తర్వాత వేధించడం మొదలెట్టాడు. ఏదో ఒక కారణం చూపిస్తూ నిత్యం భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడు. కొన్నాళ్లు పోతే భర్తలో మార్పు వస్తుందని అలాగే భరించింది. అయితే భర్తలో మర్పు రాకపోగా రోజురోజుకూ వేధింపులు ఎక్కువవడంతో.. విడాకులు తీసుకుని విడిగా జీవించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చి 18న భోపాల్‌కు వచ్చింది. దీంతో ముస్కాన్‌పై.. భర్త మరింత కోపం పెంచుకున్నాడు. మంగళవారం మధ్యాహ్నం భార్యకు పోన్ చేశాడు.
పూడ్చిపెట్టిన 19 రోజుల తర్వాత సమాధిని తవ్వి మృతదేహానికి DNA Test.. కనీవినీ ఎరుగని వింత కేసు.. అసలు కథేంటంటే..
‘‘భోపాల్‌లోని రోడ్డుపై నీ కోసం ఎదురుచూస్తున్నా.. విడాకుల పత్రాలపై సంతకాలు చేయాలి.. వచ్చేయ్’’.. అని చెప్పాడు. దీంతో భర్త చెప్పిన ప్రాంతానికి ఒంటరిగా వెళ్లింది. అక్కడికి వెళ్లగానే ఒక్కసారిగా భార్యను పక్కకు లాగాడు. అప్పటికే జేబులో సిద్ధంగా ఉంచుకున్న పెట్రోల్‌ను భార్య తలపై పోసి నిప్పంటించాడు. దీంతో ఆమె తలపై మంటలు చెలరేగాయి. స్థానికులు గుమికూడడంతో రయీస్ ఖాన్.. అక్కడి నుంచి పరారయ్యాడు. మంటల్లో కొట్టుమిట్టాడుతున్న ముస్కాన్‌ను గమనించి అంతా చుట్టుముట్టారు. కొందరు ఆమె తలపై నీళ్లు పోసి మంటలను ఆర్పివేశారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
wapping: హై క్లాస్ కుటుంబాల్లో ఇదంతా సాధారణం.. నువ్వే అలవాటు పడాలంటూ ఓ భర్త నీచం.. ఆ భార్య చెబుతున్న నిజాలివి..
Updated Date - 2022-07-06T22:19:52+05:30 IST