ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మా! మీ అల్లుడు ఎవరో బాలికను ఇంటికి తీసుకొచ్చాడని చెప్పిన కూతురు.. మరుక్షణమే ఫోన్ కట్.. తీరా ఇంటికి వెళ్లి చూస్తే..

ABN, First Publish Date - 2022-07-07T00:01:01+05:30

భార్య కళ్లుగప్పి కొంతమంది చేయరాని తప్పులన్నీ చేస్తుంటారు. తమ గురించి ఎవరికీ తెలియదులే అని అనుకుంటారు. అయితే చివరకు మాత్రం వారి అసలు స్వరూపం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భార్య కళ్లుగప్పి కొంతమంది చేయరాని తప్పులన్నీ చేస్తుంటారు. తమ గురించి ఎవరికీ తెలియదులే అని అనుకుంటారు. అయితే చివరకు మాత్రం వారి అసలు స్వరూపం బయటపడుతుంది. ఆ సమయంలో కొందరు రాక్షసుల్లా ప్రవర్తించి.. దారుణాలకు తెగబడుతుంటారు. తాజాగా, బీహార్‌లో విషాధ ఘటన చోటు చేసుకుంది. అమ్మా!.. మీ అల్లుడు ఎవరో బాలికను రాత్రి వేళ ఇంటికి తీసుకొచ్చాడు.. అని కూతురు తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. మరుక్షణమే ఆమె ఫోన్ కట్ అయింది. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు పరుగుపరుగున ఇంటికి వెళ్లారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


బీహార్ రాష్ట్రం నలంద అనే ప్రాంత పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. జయమంతి దేవి (26)కి 2015లో వివాహమైంది. భర్త ఎంతో ప్రేమగా చూసుకోవడంతో వారి ఇంట్లో మొన్నటి వరకూ ఎలాంటి సమస్యలూ లేవు. ప్రస్తుతం వీరికి ఓ కుమార్తె ఉంది. అయితే ఇటీవల భర్త ప్రవర్తనలో మార్పు వచ్చింది. స్థానికంగా నివాసం ఉంటున్న ఓ బాలికతో ప్రేమాయణం సాగించాడు. భార్యకు తెలీకుండా వ్యవహారం నడిపించేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి బాలికను ఏకంగా ఇంటికే తీసుకొచ్చాడు. దీంతో జయమంతి ఒక్కసారిగా షాక్ అయింది. ‘‘ఇదేం పద్ధతి.. ఎన్నాళ్లుగా సాగుతోంది ఈ వ్యవహారం’’.. అంటూ నిలదీసింది. వెంటనే తన తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. అమ్మా!.. మీ అల్లుడు ఎవరో బాలికను రాత్రి వేళ ఇంటికి తీసుకొచ్చాడు.. అని చెప్పింది. దీంతో భయపడిన బాలిక అక్కడి నుంచి వెళ్లిపోయింది.

రోడ్డుపై ఎదురు చూస్తున్నా తొందరగా వచ్చేయ్.. అని భార్యకు పోన్ చేశాడు.. తీరా దగ్గరికి వచ్చాక.. అంతా చూస్తుండగా ఒక్కసారిగా..


ప్రియురాలు బయటికి వెళ్లిపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త.. ఒక్కసారిగా భార్యపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం కూతురుని కూడా హత్య చేసి, అక్కడి నుంచి పరారయ్యాడు. కూతురు ఫోన్ సడన్‌గా కట్ అవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు.. పరుగుపరుగున ఇంటికి చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లగానే కూతురు, మనువరాలి మృతదేహాలు పడి ఉండడం చూసి బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

wapping: హై క్లాస్ కుటుంబాల్లో ఇదంతా సాధారణం.. నువ్వే అలవాటు పడాలంటూ ఓ భర్త నీచం.. ఆ భార్య చెబుతున్న నిజాలివి..



Updated Date - 2022-07-07T00:01:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising