ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెరుగు తేవడానికి వెళ్లిన భర్త.. ఇంటికి చేరుకునేలోపు లోపలి నుంచి కటింగ్ మిషన్ శబ్ధాలు.. తీరా కిటికీ తలుపు తీసి చూస్తే..

ABN, First Publish Date - 2022-06-30T21:40:53+05:30

ఆ దంపతులకు తొమ్మిదేళ్ల చిన్నారి ఉంది. ఆనందంగా సాగుతున్న వారి కుటుంబంలో అనుకోని సమస్యలు తలెత్తాయి. చిన్న చిన్న విషయాలకే దంపతులిద్దరూ గొడవ పడుతూ.. సవ్యంగా సాగుతున్న సంసారాన్ని సమస్యలకు నిలయంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ దంపతులకు తొమ్మిదేళ్ల చిన్నారి ఉంది. ఆనందంగా సాగుతున్న వారి కుటుంబంలో అనుకోని సమస్యలు తలెత్తాయి. చిన్న చిన్న విషయాలకే దంపతులిద్దరూ గొడవ పడుతూ.. సవ్యంగా సాగుతున్న సంసారాన్ని సమస్యలకు నిలయంగా మార్చారు. ఓ రోజు పెరుగు తెచ్చే విషయంలో భార్యాభర్తలకు గొడవ జరిగింది. చివరకు రాజీ పడిన భర్త.. బయటికి వెళ్లి పెరుగు తీసుకుని ఇంటికి వచ్చాడు. అయితే ఇంటి సమీపానికి వచ్చే సరికి.. లోపలి నుంచి కటింగ్ మిషన్ శబ్ధాలు వినిపించాయి. దీంతో కంగారుగా లోపలికి వెళ్లిన భర్తకు.. షాకింగ్ సీన్ కనిపించింది. ఈ విషాద ఘటన వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్ రాష్ట్రం చురు ప్రాంత పరిధిలోని సర్దార్‌షహర్‌ గ్రామానికి చెందిన రాంలాల్‌కు.. బీహార్ రాష్ట్రం ఝలారియా కువాన్ గ్రామానికి చెందిన ఆర్తీ దేవి (25)తో రెండేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం వీరికి 9నెలల బాబు ఉన్నాడు. మొదట్లో ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ దంపతుల మధ్య.. రాను రాను సమస్యలు మొదలయ్యాయి. చిన్న చిన్న విషయాలకే గొడవ పడేవారు. భర్త సర్దుకుపోయినా.. భార్య మాత్రం చిన్న విషయాన్ని కూడా చాలా సీరియస్‌గా తీసుకునేది. ఇలావుండగా, బుధవారం సాయంత్రం పెరుగు తీసుకొచ్చే విషయంలో దంపతుల మధ్య గొడవ జరిగింది. భార్య వెళ్లకపోవడంతో.. చివరకు భర్తే పెరుగు తేవడానికి వెళ్లాడు. తల్లితో పాటూ ఆలయానికి వెళ్లి, అటు నుంచి పెరుగు తీసుకుని ఇంటికి వచ్చాడు.

కడుపునొప్పి అని కూతుర్ని ఆస్పత్రికి తీసుకెళ్తే గర్భవతి అని చెప్పిన డాక్టర్లు.. ఏం జరిగిందని ఆ తల్లి ఏడుస్తూ అడిగితే..


అయితే ఇంటికి చేరుకోగానే లోపల నుంచి కటింగ్ మిషన్ శబ్ధాలు వినిపించాయి. తలుపులు మూసి ఉండడంతో కిటికీ తెరచి చూడగా.. లోపల చిన్నారి రక్తపు మడుగులో ఏడుస్తూ ఉన్నాడు. పక్కనే కటింగ్ మిషన్ రన్ అవుతోంది. మరోవైపు ఆర్తి దేవి కూడా అపస్మారక స్థితిలో పడి ఉంది. దీంతో రాంలాల్‌తో పాటూ స్థానికులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో ఆర్తి మృతి చెందింది. చిన్నారి చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కొడుకును కటింగ్ మిషన్‌తో గొంతు కట్ చేసి, తానూ ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఆమె మృతి వెనుక ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

విపరీతంగా మద్యానికి అలవాటు పడిన భార్య.. ఎన్నిసార్లు చెప్పినా మార్పు లేకపోవడంతో ఆ భర్త ఏం చేశాడంటే..



Updated Date - 2022-06-30T21:40:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising