మీ చెల్లెలు ప్రేమ వివాహం చేసుకుందా... అంటూ స్నేహితుడితో చర్చించిన యువకుడు.. ఓ రోజు ఇంటికి పిలవడంతో వెళ్లగా..
ABN, First Publish Date - 2022-10-24T17:02:01+05:30
ప్రేమ వివాహాల సమయంలో కొన్నిసార్లు దారుణ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు యువతి తరపు వారి నుంచి.. మరికొన్నిసార్లు యువకుడి తరపు వారి నుంచి సమస్యలు తలెత్తుతుంటాయి. ఢిల్లీ పరిధిలో తాజాగా విషాద ఘటన చోటు చేసుకుంది. మీ చెల్లెలు ప్రేమ వివాహం చేసుకుందా.. అని స్నేహితుడిని..
ప్రేమ వివాహాల సమయంలో కొన్నిసార్లు దారుణ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు యువతి తరపు వారి నుంచి.. మరికొన్నిసార్లు యువకుడి తరపు వారి నుంచి సమస్యలు తలెత్తుతుంటాయి. ఢిల్లీ పరిధిలో తాజాగా విషాద ఘటన చోటు చేసుకుంది. మీ చెల్లెలు ప్రేమ వివాహం చేసుకుందా.. అని స్నేహితుడిని ఓ యువకుడు ఆట పట్టించాడు. ఇదే అతడి పాలిట మృత్యుపాశంగా మారింది. చివరకు ఓ రోజు స్నేహితుడు పిలవడంతో ఇంటికి వెళ్లాడు. అక్కడ జరిగిన అనూహ్య ఘటనతో స్థానికులంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..
దేశ రాజధాని ఢిల్లీలోని (Delhi) జహంగీర్‌పురి పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. చిరాగ్, రాహుల్ అనే యువకులు స్నేహితులు. వీరి స్నేహం జీవితంలో ఇంత వరకూ ఎలాంటి సమస్యలూ చోటు చేసుకోలేదు. అయితే ఇటీవల అనుకోని సమస్య వచ్చి పడింది. కొన్ని నెలల క్రితం చిరాగ్ సోదరి ప్రేమ వివాహం (love marriage) చేసుకుంది. ఇదిలావుండగా, ఇటీవల చిరాగ్, రాహుల్ మధ్య ప్రేమ వివాహానికి సంబంధించిన చర్చ జరుగుతోంది. మీ చెల్లెలు ప్రేమ వివాహం చేసుకుందా.. అంటూ రాహుల్ తన స్నేహితుడు చిరాగ్‌తో తరచూ హేళనగా మాట్లాడేవాడు. ఈ విషయంలో తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. శనివారం కూడా ఇదే విషయమమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
దీంతో రాహుల్‌పై చిరాగ్ పగ పెంచుకున్నాడు. తన చెల్లెలిని అవమానకరంగా మాట్లాడటాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఎలాగైనా రాహుల్‌ను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం రాహుల్‌కు ఫోన్ చేసి, తన ఇంటికి రావాలని పిలిచాడు. అక్కడికి వెళ్లిన రాహుల్‌పై చిరాగ్, అతడి స్నేహితులు.. కత్తులతో దాడి చేశారు. సుమారు 30 కత్తిపోట్లు పొడవడంతో రాహుల్.. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రాహుల్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మొత్తం నలుగురి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం అంతా మైనర్లే కావడం గమనార్హం. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Updated Date - 2022-10-24T17:04:58+05:30 IST