నన్ను కిడ్నాప్ చేసి రూ.70 వేలు దోచుకెళ్లారంటూ కేసు పెట్టిన యువతి.. పోలీసులకు డౌట్.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!
ABN, First Publish Date - 2022-05-26T00:29:52+05:30
ఓ యువతి రూ.70వేలు తీసుకుని పోస్టాఫీసులో జమ చేసేందుకు వెళ్తోంది. మార్గమధ్యంలో కొందరు దుండగులు బైక్‌పై వేగంగా వచ్చి.. ఆమె చేతిలోని నగదును లాక్కుని పరారయ్యారు. ఊహించని ఈ ఘటనకు..
ఓ యువతి రూ.70వేలు తీసుకుని పోస్టాఫీసులో జమ చేసేందుకు వెళ్తోంది. మార్గమధ్యంలో కొందరు దుండగులు బైక్‌పై వేగంగా వచ్చి.. ఆమె చేతిలోని నగదును లాక్కుని పరారయ్యారు. ఊహించని ఈ ఘటనకు యువతి ఒక్కసారిగా షాక్ అయింది. దాచుకున్న డబ్బులు ఒక్కసారిగా దొంగలపాలవడంతో ఏడవడం మొదలెట్టింది. విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. సమాచారం అందుకున్న పోలీసులు... సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. అయితే వారి విచారణలో షాకింగ్ ట్విస్ట్ బయటపడింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
బీహార్‌లోని జెహనాబాద్ జిల్లా రామ్‌నగర్-విషుంగంజ్ మొహల్లాలో నివాసం ఉంటున్న అంజలి అనే యువతికి చిన్నప్పటి నుంచి లక్షాధికారి కావాలనేది కోరిక. అందుకోసం ఏం చేయాలనే విషయంపై నిత్యం ఆలోచిస్తూ ఉండేది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం యువతి మొబైల్‌కు ఓ నంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. మీరు రూ.25 లక్షల రివార్డు గెలుచుకున్నారంటూ అవతలి వ్యక్తి తెలిపాడు. దీంతో యువతి తన కల నిజమవుతోందనే సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయింది. అయితే వెంటనే ఆ వ్యక్తి, రూ.50 వేలు జమ చేస్తే.. గెలుచుకున్న మొత్తాన్ని పంపిస్తామని చెప్పాడు. దీంతో ఇంట్లో దాచి ఉంచిన రూ.50వేలను అపరిచిత వ్యక్తి అకౌంట్‌లో జమ చేసింది. మళ్లీ అవతలి వ్యక్తి.. వివిధ కారణాలు చూపుతూ మరో రూ.20వేలు పంపితే.. రూ.25 లక్షలు పంపిస్తానని చెప్పాడు.
Tricycle కాదు.. అంతకు మించి Sonu Sood సాయం.. ఒంటి కాలిపై గెంతుతూ స్కూలుకు వెళ్తున్న పాపను చూసి..
ఎలాగైనా లక్షలు సొంతం చేసుకోవాలనే ఆశతో.. అతను అడిగిన మొత్తాన్ని పంపించింది. తర్వాత అవతలి వ్యక్తి నుంచి సమాధానం లేదు. మోసపోయానని తెలుసుకున్న యువతి.. ఇంట్లో తెలిస్తే తిడతారని భయపడింది. దీంతో దొంగలు దోచుకెళ్లారంటూ కట్టు కథ అల్లింది. అయితే ఆమె చెప్పిన ప్రాంతంలో పోలీసులు విచారించగా.. అలాంటిదేమీ జరగలేదని తెలిసింది. దీంతో బాలికపై అనుమానం వచ్చి గట్టిగా నిలదీయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అపరిత వ్యక్తిని పట్టుకునే పనిలో పడ్డారు. ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
20 అడుగుల లోతైన డ్రైనేజీ గుంటలో పడిపోయిన చిన్నారి.. క్షణం కూడా ఆలస్యం చేయకుండా దూకేసిన తల్లి..!
Updated Date - 2022-05-26T00:29:52+05:30 IST