Sai Dharam Tej: హాస్పిటల్ లో వున్నప్పుడు అమ్మకి చెప్పలేనిది ఇప్పుడు చెప్పాడు

ABN, First Publish Date - 2022-12-07T13:02:25+05:30

ఈ సినిమా టైటిల్ అండ్ టీజర్ ని సాయి ధరమ్ తేజ్ అమ్మ గారు విడుదల చేసారు. ఆమె కూడా ఈ ఫంక్షన్ కి వచ్చారు.

Sai Dharam Tej: హాస్పిటల్ లో వున్నప్పుడు అమ్మకి చెప్పలేనిది ఇప్పుడు చెప్పాడు
Sai Dharam Tej speaking at his film 'Viroopaksha' film function
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సినిమా టైటిల్ 'విరూపాక్ష' అని ఈరోజు జరిగిన ఒక ఫంక్షన్ లో రెవీల్ చేశారు. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్క్రీన్ ప్లే అందించటం విశేషం. బి వి ఎస్ ఎన్ ప్రసాద్ దీనికి నిర్మాత కాగా ఈరోజు అంటే డిసెంబర్ 7వ తేదీన ఈ సినిమా టైటిల్ ని ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ లో విడుదల చేసారు. దీనికి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్. వాయిస్ ఓవర్ ఇవ్వటం విశేషం. ఈ సినిమా ఫంక్షన్ లో సాయి ధరమ్ తేజ్ కొంచెం భావోద్వేగానికి లోనయి, వెంటనే మళ్ళీ మామూలు అయ్యాడు. ఈ సినిమా టైటిల్ అండ్ టీజర్ ని సాయి ధరమ్ తేజ్ అమ్మ గారు విడుదల చేసారు. ఆమె కూడా ఈ ఫంక్షన్ కి వచ్చారు. ఈ ఫంక్షన్ లో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ తన అమ్మగారికి హాస్పిటల్ బెడ్ మీద వున్నప్పుడు తాను చెప్పలేకపోయాను అని ఇప్పుడు చెప్పాడు. "అమ్మ ఐ యాం సారీ' అని చెప్పారు. మరి ఎందుకు సారీ చెప్పాల్సి వచ్చిందో చెప్పలేదు సాయి తేజ్.

SDT-mother.jpg

ఈరోజు తాను ఈ స్టేజి మీద ఉండటానికి తన ముగ్గురు మామయ్యలు కారణం అని చెప్పాడు. తన ముగ్గురు మామయ్యల ఋణం తీర్చుకో లేనిది అని చెపుతూ తన ప్రేమ ఎప్పుడూ వాళ్ళకి ఉంటుందని చెప్పాడు. అలాగే అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో కూడా చెప్పి నవ్వించాడు. "నేను పాట పాడితే బాగుంది అని చెప్పిన దానివి నువ్వు ఒక్కర్తివే అమ్మా," అని అమ్మ తనని కొడుకుగా ఎంతగా ప్రేమిస్తుందో ఈ విషయం ద్వారా చెప్పాడు సాయి తేజ్. ఇంకా ఈ సినిమా కూడా తన తల్లి కోసమే చేసినట్టు చెప్పాడు. ఈ సినిమా కోసం చాల కష్టపడ్డా అని కూడా అన్నాడు. కార్తీక్ తనకి కథ ఎలా నేరేట్ చేసాడో అలానే తీసాడు అని చెప్పాడు.

Updated Date - 2022-12-07T13:19:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising