ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్ని సార్లు చెప్పినా వినకుండా ప్రియుడితో సీక్రెట్‌గా ఫోన్లో మాట్లాడుతున్న కూతురు.. ఓ రోజు రాత్రి తండ్రి చూసి..

ABN, First Publish Date - 2022-05-26T01:50:19+05:30

పిల్లలు తప్పు చేసిన సందర్భంలో చాలా మంది తల్లిదండ్రులు వారికి అర్థమయ్యేలా చెప్పి మరోసారి అలాంటి తప్పు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ప్రేమ వ్యవహారాల్లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిల్లలు తప్పు చేసిన సందర్భంలో చాలా మంది తల్లిదండ్రులు వారికి అర్థమయ్యేలా చెప్పి మరోసారి అలాంటి తప్పు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ప్రేమ వ్యవహారాల్లో మాత్రం కొన్నిసార్లు ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. ప్రేమ పేరుతో తమ పరువు తీస్తోందంటూ కొందరు తల్లిదండ్రులు ఆగ్రహంతో రగిలిపోతుంటారు. పిల్లల మనసు అర్థం చేసుకోకుండా దారుణాలకు పాల్పడుతుంటారు. బీహార్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులు ఎన్నిసార్లు చెప్పినా వినకుండా.. కూతురు తన ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతుండేది. అయితే ఓ రోజు రాత్రి ఆమె తండ్రి గమనించాడు. తర్వాత ఏం జరిగిందంటే..


బీహార్ రాష్ట్రం దర్భంగా జిల్లా మోరో పరిధి  రతన్‌పురా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఉస్మాన్ అనే వ్యక్తికి భార్య, అఫ్రీన్(20) అనే కుమార్తె ఉన్నారు. ఉస్మాన్ ఇటీవల తన కూతురికి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే అఫ్రీన్ అప్పటికే వేరే యువకుడితో ప్రేమలో ఉంది. ఓ రోజు కూతురి ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు తెలిసింది. ప్రేమగీమా పక్కన పెట్టి.. తాము చెప్పిన యువకుడినే పెళ్లి చేసుకోవాలని ఉస్మాన్.. తన కూతురికి షరతు పెట్టాడు. అయినా అఫ్రీన్ మాత్రం తన ప్రియుడితో తరచూ సీక్రెట్‌గా ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. ఇటీవల ఓ రోజు రాత్రి యువతి తన ప్రియుడితో మాట్లాడుతుండగా.. ఆమె తండ్రి గమనించాడు. ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయి, కూతురిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు.

నన్ను కిడ్నాప్ చేసి రూ.70 వేలు దోచుకెళ్లారంటూ కేసు పెట్టిన యువతి.. పోలీసులకు డౌట్.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!


ఈ ఘటన మొత్తం అఫ్రీన్ మాట్లాడుతుండగా జరగడంతో.. ఆమె ప్రియుడు ఫోన్‌లో వాయిస్ రికార్డు చేశాడు. ‘‘దయచేసి నన్ను కొట్టొద్దు నాన్న’’.. అని వేడుకుంటున్నా , వినకుండా దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తర్వాత మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా గ్రామ పరిధిలోని ఓ చెరువులో పడేశాడు. మరుసటి రోజు తన కూతురు అదృశ్యమైందంటూ కట్టుకథ అల్లాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు చెరువులోని మృతదేహాన్ని వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అఫ్రీన్ ప్రియుడి ద్వారా ఆడియో క్లిప్ బయటికి రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నివేదిక రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tricycle కాదు.. అంతకు మించి Sonu Sood సాయం.. ఒంటి కాలిపై గెంతుతూ స్కూలుకు వెళ్తున్న పాపను చూసి..

Updated Date - 2022-05-26T01:50:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising