పెళ్లి వేడుకలో వరుడి ప్రవర్తన చూసి వధువు తండ్రి షాకింగ్ నిర్ణయం.. అదే ముహూర్తానికి కూతురికి వేరే వ్యక్తితో..
ABN, First Publish Date - 2022-04-27T18:12:58+05:30
వివాహ కార్యక్రమాల్లో ఒక్కోసారి అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. వధూవరుల ప్రవర్తన విషయంలోనో, కట్నకానుకలు తదితర విషయాల్లోనో సమస్యలు...
వివాహ కార్యక్రమాల్లో ఒక్కోసారి అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. వధూవరుల ప్రవర్తన విషయంలోనో, కట్నకానుకలు తదితర విషయాల్లోనో సమస్యలు తలెత్తుతుంటాయి. దీంతో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వధూవరులు.. పంచాయితీలకు వెళ్లి చివరికి పెళ్లిళ్లనే రద్దు చేసుకున్న ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. కొన్ని సార్లు చిన్న చిన్న కారణాలకు కూడా వివాహాలు రద్దు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మహారాష్ట్రలో ఓ వివాహ వేడుక అర్ధాంతరంగా ముగిసింది. అయితే యువతి తండ్రి అదే ముహూర్తానికి షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా మల్కాపూర్ పాంగ్రాలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ప్రియాంక అనే యువతికి వివాహం నిశ్చయమైంది. ఏప్రిల్ 24న ముహూర్తం ఖరారు చేసుకున్నారు. పెళ్లి రోజు బంధువులంతా గ్రామానికి చేరుకున్నారు. సాయంత్రం వధువు గ్రామానికి వరుడు రావాల్సి ఉంది. పెళ్లికుమార్తెతో పాటూ బంధువులంతా వరుడి కోసం ఎదురుచూస్తున్నారు. రావాల్సిన సమయం కంటే నాలుగు గంటలు ఆలస్యంగా వరుడు గ్రామానికి చేరుకున్నాడు. ఇందులో ఏ సమస్య లేకున్నా.. అసలు సమస్య ఇక్కడే వచ్చి పడింది. ఆలస్యంగానైనా క్షేమంగా వచ్చారులే అని అంతా అనుకున్నారు. కానీ ఇంతలోనే ఊహించని ఘటన చోటు చేసుకుంది.. వరుడు ఉన్న పరిస్థితిని చూసి అంతా షాకయ్యారు. అతన్ని ఆ పరిస్థితుల్లో చూసిన వధువు తండ్రికి కోపం కట్టలు తెంచుకుంది.
తన సోషల్ మీడియా అకౌంట్‌లో అసభ్యకర వీడియోలను చూసి ఖంగుతిన్న టీచర్.. దీనిపై ఆరాతీయగా చివరకు ఏం తెలిసిందంటే..
అతడికి తన కూతుర్ని ఇచ్చేదే లేదని తెగేసి చెప్పాడు. వరుడి తరపు వారు ఎంత బ్రతిమాలినా వినిపించుకోలేదు. పెళ్లికుమారుడి తరపు బంధువులందరినీ అక్కడి నుంచి బలవంతంగా పంపించేశారు. కూతురు పెళ్లి ఆగిపోతే పరువు పోతుందని భావించి, అదే ముహూర్తానికి ఎలాగైనా పెళ్లి చేయాలని భావించారు. అయితే గొడవ జరుగుతున్న సమయంలో వరుడి తరపు వారిని వారించడంతో పాటూ ఇలా వ్యవహరించడం తప్పని ఓ యువకుడు మందలించాడు. ఆ యువకుడి ప్రవర్తన వధువు తండ్రికి నచ్చింది. తన కూతుర్ని ఆ యువకుడికే ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత యువకుడి తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లికి ఒప్పించారు. వధువుకు కూడా అతడు స్నేహితుడు కావడంతో ఆమె కూడా అంగీకరించింది. ఎట్టకేలకు అదే ముహూర్తానికి పెళ్లి జరగడంతో కథ సుఖాంతమైంది. ఇదిలావుండగా మద్యం సేవించిన వరుడు కూడా మరుసటి రోజు వేరే యువతిని పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశానికి దారి తీసింది.
నేను నిన్ను ప్రేమిస్తున్నానంటూ ప్రపోజ్ చేసిన యువకుడు... కొన్ని రోజులకు హత్యకు గురైన ప్రియురాలు, తల్లిదండ్రులు.. అసలు ఏం జరిగిందంటే..
Updated Date - 2022-04-27T18:12:58+05:30 IST