ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వదినపై ప్రేమతో భార్యను దూరం పెట్టాడు.. విషయం ఇంట్లో తెలియడంతో రోజూ గొడవలు.. ఓ రోజు అర్ధరాత్రి భార్య గదికి వెళ్లి..

ABN, First Publish Date - 2022-05-15T17:13:32+05:30

దంపతుల మధ్య ఎన్ని సమస్యలు తలెత్తినా మళ్లీ యథావిధిగా కలిసిపోతుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం సమస్యలు చాలా దూరం వెళ్తుంటాయి. ఒక్కోసారి విడాకులు తీసుకునే వరకూ...

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దంపతుల మధ్య ఎన్ని సమస్యలు తలెత్తినా మళ్లీ యథావిధిగా కలిసిపోతుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం సమస్యలు చాలా దూరం వెళ్తుంటాయి. ఒక్కోసారి విడాకులు తీసుకునే వరకూ వెళ్తుంటాయి. ఇటీవల వివాహేతర సంబంధాల కారణంగా చాలా కుటుంబాల్లో తరచూ గొడవలు జరగడం చూస్తూనే ఉన్నాం. మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి వదినపై ప్రేమతో భార్యను దూరం పెట్టాడు. ఈ విషయం భార్యకు తెలియడంతో రోజూ గొడవలు జరుగుతుండేవి. చివరకు ఏం జరిగిందంటే..


మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లా పరిధిలోని భర్సేడి గ్రామానికి చెందిన రామ్‌రాజ్ షాకు ఆర్తి అనే యువతితో 2020లో వివాహమైంది. కొన్నాళ్లు దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉన్నారు. తర్వాత వారి జీవితంలో అనుకోని సమస్యలు తలెత్తాయి. కొన్నాళ్లు భార్యను ప్రేమగా చూసుకున్న రామ్‌రాజ్.. తర్వాత వరకట్నం పేరుతో భార్యను చిత్రహింసలు పెట్టడం మొదలెట్టాడు. ఈ విషయంలో ఆర్తి.. పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో రామ్‌రాజ్‌కు, అతడి వదినకు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అప్పటి నుంచి భార్యను దూరం పెట్టాడు.

భర్తకు పాలల్లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి పెళ్లైన మూడో రోజే ఇంట్లోంచి ఎస్కేప్.. మర్నాడే భార్య వీడియో కాల్ చేసి..


ఈ విషయం భార్యకు తెలియడంతో గొడవలు ఇంకా ఎక్కువయ్యాయి. వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించడంతో భార్యపై కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా భార్యను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఏప్రిల్ 16న రాత్రి భార్య పడుకుని ఉండగా.. గొంతు కోసి హత్య చేశాడు. తర్వాత అనుమానం రాకుండా భార్య మృతదేహాన్ని ఉరికి వేలాడదీశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, ఆర్తి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా  రామ్‌రాజ్, అతడి కుటుంబ సభ్యులను అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. 

పెళ్లిమంటపంలోనే వరుడిని చంపి.. నిన్ను తీసుకెళ్తా.. వధువుకు పక్కింటి యువకుడి ఫోన్‌కాల్.. చివరకు..

Updated Date - 2022-05-15T17:13:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising