రోడ్డుపై నిలబడి లిఫ్ట్ అడిగిందో 32 ఏళ్ల మహిళ.. అటుగా వెళ్తూ కారులో ఎక్కించుకున్న డ్రైవర్.. చివరకు..
ABN, First Publish Date - 2022-04-26T18:18:08+05:30
32ఏళ్ల మహిళ రోడ్డుపై నిలబడి లిఫ్ట్ కోసం ఎదురు చూస్తోంది. అదే సమయంలో అటుగా వెళ్తున్న కారు డ్రైవర్.. ఆమెను ఎక్కించుకున్నాడు. చివరకు..
మహిళ ఒంటరిగా కనిపిస్తే.. దాడి చేసేందుకు మానవ మృగాలు పొంచి ఉంటాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా అత్యాచారాలు, హత్యలు ఎక్కువైపోయాయి. తాజాగా రాజస్థాన్‌లో జరిగిన ఘటన ప్థానికంగా సంచలనం కలిగించింది. 32ఏళ్ల మహిళ రోడ్డుపై నిలబడి లిఫ్ట్ కోసం ఎదురు చూస్తోంది. అదే సమయంలో అటుగా వెళ్తున్న కారు డ్రైవర్.. ఆమెను ఎక్కించుకున్నాడు. చివరకు వారు చేసిన నిర్వాకం తెలుసుకుని అంతా షాక్ అయ్యారు.
రాజస్థాన్‌లోని జైపూర్‌లోని కోట్‌ఖవ్డాలో అనే ప్రాంతానికి చెందిన మహిళ.. ఈ నెల 23న దౌసాలోని రామ్‌గఢ్ పచ్వారా గ్రామంలోని తల్లిదండ్రుల వద్దకు బయలుదేరింది. మధ్యాహ్నానికి తాను వెళ్లాల్సిన ప్రాంతం సమీపంలోని బస్టాండ్‌కు చేరుకుంది. అక్కడి నుంచి లిఫ్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంది. అదే సమయంలో ఓ కారు అటుగా వచ్చింది. లిఫ్ట్ ఇస్తానని చెప్పడంతో మహిళ కారు ఎక్కింది. లోపల డ్రైవర్‌తో పాటూ ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఇద్దరూ కలిసి ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అనంతరం ఆమె నోరు మూసి అత్యాచారం చేశారు. విషయం బయటికి తెలిస్తే ప్రమాదమనే ఉద్దేశంతో ఆమెను హత్య చేసి, సమీపంలోని ఓ బావిలో పడేసి వెళ్లిపోయారు. కూతురు సాయంత్రం అవుతున్నా ఇంటికి రాకపోవడంతో తండ్రి తన అల్లుడికి ఫోన్ చేశాడు. దీంతో కంగారుపడి అంతా వెతకడం ప్రారంభించారు. అయినా ఫలితం లేకపోవడంతో మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మేడ మీద గాఢనిద్రలో వదిన.. అర్ధరాత్రి గదిలో అన్నను చంపిన తమ్ముడు.. విచారణలో విస్తుపోయే నిజాలు..!
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె వెళ్లిన ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. బస్టాండ్ ప్రాంతంలో ఓ కారు అనుమానాస్పదంగా ఉండడంతో విచారణ చేపట్టారు. చివరకు కారు డ్రైవర్ కాలూరామ్ మీనాను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. తర్వాత బావిలోని మహిళ మృతదేహాన్ని వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇదిలావుండగా ఆస్పత్రి వద్ద మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. నిందితులకు ఉరి శిక్ష వేసే వరకూ మృతదేహాన్ని తీసుకెళ్లమని భీష్మించుకున్నారు. చివరకు జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో శాంతించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈమెకు కుక్కంటే ఎంత అభిమానం.. రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై మహిళ తీరు చూసి అవాక్కవుతున్న జనం..
Updated Date - 2022-04-26T18:18:08+05:30 IST