ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొబైల్ షాపు నిర్వాహకుడితో వివాహితకు పరిచయం.. ఉపాధి నిమిత్తం భర్త దూరంగా ఉండడంతో... ఓ రోజు ఏకంగా ఇంటికే పిలిచి..

ABN, First Publish Date - 2022-05-29T03:03:32+05:30

పెళ్లి పేరుతో ఒక్కటయ్యే దంపతులు.. జీవితాంతం అదే బంధాన్ని కొనసాగించాలని కోరుకుంటూ బంధువులంతా అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. అయితే కొందరి విషయంలో మాత్రం ఇందుకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెళ్లి పేరుతో ఒక్కటయ్యే దంపతులు.. జీవితాంతం అదే బంధాన్ని కొనసాగించాలని కోరుకుంటూ బంధువులంతా అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. అయితే కొందరి విషయంలో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. దీంతో అప్పటిదాకా సవ్యంగా సాగుతున్న సంసారం కాస్త.. సమస్యలకు నిలయంగా మారుతుంటుంది. తద్వారా వైవాహిక బంధం మధ్యలోనే ముగుస్తుంటుంది. మధ్యప్రదేశ్‌లో ఓ కుటుంబం విషయంలో ఇలాగే జరిగింది. ఓ వివాహితకు మొబైల్ షాపు నిర్వాహకుడితో పరిచయమైంది. భర్త అప్పటికే ఉపాధి నిమిత్తం ఊరికి దూరంగా ఉండడంతో అతడికి దగ్గరైంది. చివరికి ఏం జరిగిందంటే..


మధ్యప్రదేశ్‌ రాష్ట్రం షికార్‌పూర్‌ పరిధిలోని గ్రామానికి చెందిన సుశీలాదేవి ఒంటరిగా నివాసం ఉంటోంది. ఈమె భర్త ముంబైలో కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో సుశీలాదేవి ఓ రోజు స్థానికంగా ఉంటున్న మొబైల్ షాప్‌కు రీచార్జ్ చేయించుకోవడానికి వెళ్లింది. ఆ సమయంలో షాపు నిర్వాహకుడు వినోద్‌రామ్‌.. మహిళతో మాటామాటా కలిపాడు. భర్త దూరంగా ఉన్న విషయాన్ని తెలుసుకున్న అతడు.. ఆమెతో పదే పదే మాట్లాడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఆమె కూడా అతడిపై ప్రేమ పెంచుకుంది. ఓ రోజు రాత్రి ఏకంగా ఇంటికే పిలిచి అతడితో రాసలీలలు సాగించింది. తర్వాత వినోద్‌రామ్‌.. పగటి వేళల్లో కూడా వచ్చిపోతూ ఉండేవాడు. ఇలా ఆరు నెలలుగా వీరి వ్యవహారం సాగింది.

నలభై ఏళ్ల వయసులో దంపతుల మధ్య గొడవలు.. భర్తపై విరక్తి చెంది రోజూ ఫేస్‌బుక్‌లో సెర్చింగ్... చివరకు యువకుడి పరిచయంతో..


ఇటీవల స్థానికులకు వీరి మీద అనుమానం కలిగింది. ఈ క్రమంలో గురువారం రాత్రి కూడా ఆ యువకుడు.. సుశీలాదేవి ఇంటికి వచ్చాడు. గమనించిన స్థానికులు నేరుగా వారింటికి వెళ్లి ఇద్దరినీ బయటికి లాక్కొచ్చారు. స్తంభానికి కట్టేసి రాత్రంతా చితకబాది, పొద్దున ఇద్దరికీ వివాహం చేశారు. అనంతరం వినోద్‌రామ్‌.. సుశీలాదేవిని తీసుకుని ఊరి విడిచి వెళ్లిపోయాడు. ఇదిలావుండగా వారిద్దరికీ దేహశుద్ది చేసే సమయంలో కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అయింది. దీనిపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు కూడా పట్టించుకోలేదు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

ఫోన్ వచ్చిందని రాత్రి బయటకు వెళ్లిన 25 ఏళ్ల కుర్రాడు.. తెల్లారేసరికి రైల్వే బ్రిడ్జ్ కింద శవంగా.. 19 ఏళ్ల ఆ కుర్రాడి పనేనని..

Updated Date - 2022-05-29T03:03:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising