భర్త ఎదుటే భార్యపై చేయి వేసిన యువకుడు.. నా భార్యపై నీ పెత్తనం ఏంటీ.. అని భర్త ప్రశ్నించడంతో.. చివరకు..
ABN, First Publish Date - 2022-06-26T22:37:14+05:30
నేరాలకు అలవాటు పడిన కొందరు.. విచక్షణ లేకుండా ప్రవర్తిస్తుంటారు. ఈ క్రమంలో జైలుకు వెళ్లడం, మళ్లీ విడుదలవడం.. మళ్లీ మళ్లీ నేరాలు చేయడం.. ఇదే పనిగా పెట్టుకుంటుంటారు. మధ్యప్రదేశ్‌లో ఇలాంటి నేరస్థుడు..
నేరాలకు అలవాటు పడిన కొందరు.. విచక్షణ లేకుండా ప్రవర్తిస్తుంటారు. ఈ క్రమంలో జైలుకు వెళ్లడం, మళ్లీ విడుదలవడం.. మళ్లీ మళ్లీ నేరాలు చేయడం.. ఇదే పనిగా పెట్టుకుంటుంటారు. మధ్యప్రదేశ్‌లో ఇలాంటి నేరస్థుడు ఒకడు.. తన స్నేహితుడి భార్య పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. స్నేహితుడి ఎదుటే అతడి భార్యపై చేయి వేశాడు. నా భార్యపై నీ పెత్తనం ఏంటీ.. అని స్నేహితుడు ప్రశ్నించాడు. చివరకు ఏం జరిగిందంటే..
మధ్యప్రదేశ్ ఇండోర్ పరిధి లక్ష్మణ్‌పునంలో లక్కీ అనే వ్యక్తి భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే ఇటీవల కొన్ని నెలలుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. రోజురోజుకూ గొడవలు ఎక్కువవడంతో నెలన్నర క్రితం అతడి భార్య పుట్టింటికి వెళ్లింది. దీంతో అప్పటి నుంచి భార్యను తీసుకొచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయినా ఆమె మాత్రం రాలేదు. అయితే అనూహ్యంగా శనివారం ఆమె తన భర్త వద్దకు వచ్చింది. ఇంటి బయట లక్కీ తన భార్యతో మాట్లాడుతూ ఉండగా, అతడది స్నేహితుడు అజయ్, చీనా ఠాకూర్ అనే వ్యక్తి అక్కడికి వచ్చారు. లక్కీ తన భార్యతో మాట్లాడుతుండగా... మధ్యలో చీనా అనే వ్యక్తి కలుగజేసుకున్నాడు. ఎందుకిలా చేశావ్... అంటూ ఆమె చెంపపై కొట్టాడు.
చోరీకి వెళ్లిన ఇంట్లోనే మందేసిన దొంగలు.. ఖరీదైన మద్యం బాటిళ్లు ఖాళీ చేసేశారు.. రూ.22 లక్షల విలువైన..
తన భార్యపై పరాయి వ్యక్తి చేయి వేయడంతో లక్కీకి కోపం వచ్చి.. ‘‘నా భార్యపై నీ పెత్తనం ఎంటీ’’.. అని నిలదీశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన చీనా.. లక్కీపై కూడా దాడి చేశాడు. అజయ్, చీనా కలిసి లక్కీని చితకబాదారు. అంతటితో ఆగకుండా అతడి గొంతుపై కత్తితో పోడవడంతో పాటూ పక్కనే ఉన్న తాళం తీసుకుని మొఖంపై గట్టిగా కొట్టారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చీనా అనే వ్యక్తిపై గతంలో పలు దోపిడీ, దాడి కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న అజయ్, చీనా కోసం గాలిస్తున్నారు.
నీ రూమ్‌కు వెళ్లి రెస్ట్ తీసుకుంటా అనగానే ఫ్రెండ్‌కు తాళం ఇచ్చాడో వ్యక్తి.. రాత్రి వెళ్లి చూస్తే తెరచి ఉన్న తలుపులు.. లోపలకు వెళ్తే..
Updated Date - 2022-06-26T22:37:14+05:30 IST