ప్రియుడు అడిగాడని స్నానం చేసే సమయంలో వీడియో కాల్ చేసింది... ఎలాగైనా కలవాలంటూ కొన్నాళ్ల తర్వాత అతడి నుంచి మెసేజ్.. తీరా చూస్తే..
ABN, First Publish Date - 2022-04-21T17:06:35+05:30
అన్ని సౌకర్యాలు, అన్ని రకాల సంతోషాలూ ఉన్నా.. కొందరు మాత్రం దేనికోసమో ఆశపడి చివరికి మోసపోతుంటారు. ఇంకొందరు ఇలా నమ్మి మానప్రాణాలను సైతం ...
అన్ని సౌకర్యాలు, అన్ని రకాల సంతోషాలూ ఉన్నా.. కొందరు మాత్రం దేనికోసమో ఆశపడి చివరికి మోసపోతుంటారు. ఇంకొందరు ఇలా నమ్మి మానప్రాణాలను సైతం పొగొట్టుకుంటుంటారు. ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. భర్త, పిల్లలు ఉన్న ఆమె.. పరాయి మగవాడిపై మనసు పడింది. ప్రియుడు అడిగాడని ఓ రోజు స్నానం చేస్తూ వీడియో కాల్ చేసింది. కొన్నాళ్ల తర్వాత.. ఎలాగైనా కలవాలంటూ అతడి నుంచి మెసేజ్ వచ్చింది. అందుకు ఆమె నిరాకరించడంతో తర్వాత ప్రియుడి నుంచి ఓ వీడియో వచ్చింది. దాన్ని చూడగానే షాక్‌కు గురైంది. ఇంతకీ, అసలు ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ పరిసర ప్రాంతానికి చెందిన ఓ మహిళకు భర్త, పిల్లలు ఉన్నారు. భర్త ప్రేమగా చూసుకోవడంతో పాటూ ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేకపోవడంతో సంసారం సాఫీగా సాగేది. అయితే ఆమె మాత్రం లేనిపోని సమస్యలను తెచ్చుకుంది. ఓ రోజు ఆమె ఫోన్‌కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చింది. నా పేరు యోగిందర్.. అంటూ అవతలి వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. అంతటితో ఆ వ్యక్తిని దూరం పెట్టాల్సిన ఆమె.. అందుకు విరుద్ధంగా రోజూ మెసేజ్ చేయడం మొదలెట్టింది. మెసేజ్‌లతో మొదలైన వారి పరిచయం.. వీడియో కాల్స్ వరకూ వెళ్లింది. భర్త లేని సమయంలో తరచూ వీడియో కాల్ చేసుకునేవారు. ఇటీవల నెల క్రితం స్నానానికి వెళ్తుండగా.. ప్రియుడి నుంచి కాల్ వచ్చింది. అతడి కోరిక మేరకు స్నానం చేసే సమయంలో వీడియో కాల్ చేసింది. తర్వాత నుంచి ఆమెకు అసలు సమస్య మొదలైంది.
వంట చేయకుండా ఇంతసేపు ఏం చేస్తున్నావ్.. అంటూ మండిపడ్డ భర్త... చివరకు భార్యకు బలవంతంగా..
కొన్నాళ్ల తర్వాత ఇద్దరం శారీరకంగా కలుద్దామంటూ ప్రియుడి నుంచి మెసేజ్ వచ్చింది. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో మరుక్షణమే ఆమె ఫోన్‌కు వచ్చిన వీడియో చూసి షాక్‌కు గురైంది. ‘‘నేను చెప్పిన చోటికి వచ్చి కలవకపోతే వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తా’’.. అంటూ ప్రియుడు బెదిరించాడు. దీంతో చేసేదిలేక అతను చెప్పినట్లే చేసింది. వీడియోను సాకుగా చూపిస్తూ తరచూ ఆమెపై లైంగిక దాడికి పాల్పడేవాడు. రోజురోజుకూ అతడి వేధింపులు ఎక్కువ అవడంతో ఓ రోజు తన సోదరికి విషయం తెలియజేసింది. ఆమె సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పక్కా పథకం ప్రకారం యోగీందర్‌ను పిలిపించి, అదుపులోకి తీసుకున్నారు. ఈ వార్త స్థానికంగా సంచలనం కలిగించింది.
అమ్మా.. నాకు వేరే మార్గం లేదంటూ 21 ఏళ్ల ఎంబీబీఎస్ విద్యార్థిని ఘోరం.. ఆమె రాసిన లేఖలో..
Updated Date - 2022-04-21T17:06:35+05:30 IST