ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరీక్ష తనిఖీకి వెళ్ళిన వైస్ ఛాన్స్లర్ కు దిమ్మతిరిగే అనుభవం.. విద్యార్థులు ఏం చేసారంటే..

ABN, First Publish Date - 2022-12-29T14:59:34+05:30

మ్యాథ్స్ పరీక్షలో మరీ ఇంత దారుణమా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నకాలేజీలలో జరుగుతున్న సెమిస్టర్ పరీక్షల తనిఖీ కోసం వైస్ ఛాన్స్‌లర్ వెళ్లారు. అయితే పరీక్ష రాస్తున్న విద్యార్థులు చేస్తున్న పనిని నేరుగా చూసి ఆ అధికారి అవాక్కయ్యారు. ఇంతకూ ఆ అధికారికి ఎదురైన అనుభవం ఏమిటి? ఆ విద్యార్థులు ఏం చేశారు వంటి వివరాల్లోకి వెళితే..

ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌లో హేమ్ చంద్ యాదవ్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కాలేజీలలో సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే ఈ పరీక్షలు తఖినీ చెయ్యడానికి యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ అరుణా పల్టా తన టీమ్‌తో కలసి వెళ్ళారు. మ్యాథ్స్ పరీక్ష రోజు వైశాలి నగర్ కాలేజీకి వెళ్ళగా.. అక్కడి స్టూడెంట్స్‌లో కొందరు పరీక్ష రాస్తూ మొబైల్స్ చూడటం.. సదరు అధికారి కంట పడింది. పరీక్ష హాలులో మొబైల్స్ వాడటం ఏంటని.. విద్యార్థుల చేతుల్లో నుండి మొబైల్ తీసుకుని చూడగా అందులో మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ పీడీఎఫ్ కనిపించింది. ఆ పీడీఎఫ్ చూసి వైస్ ఛాన్స్లర్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు విద్యార్థులు పరీక్ష సమయంలో మొబైల్స్‌ను లోపలికి తీసుకురావడమే తప్పు. అలాంటిది వీళ్ళు ఏకంగా మ్యాథ్స్ టెక్స్ట్ బుక్‌ను డౌన్లోడ్ చేసుకుని అది చూస్తూ పరీక్ష రాస్తుంటే పర్యవేక్షణ చేయాల్సిన వారు ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు. విద్యార్థుల నుండి మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు.దీని గురించి కాలేజీ సిబ్బందిని అధ్యాపకులను వివరణ కోరగా వారి నుండి పొంతనలేని సమాధానాలు ఎదురయ్యాయి. కేవలం ఆ కాలేజీలో మాత్రమే కాకుండా చాలా చోట్ల పరీక్షల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా ఉంటున్నట్టు తెలిసింది.

Updated Date - 2022-12-29T15:00:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising