ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైల్వే ట్రాక్‌పై మహిళ మృతదేహం.. క్లూ కోసం వెతుకుతుండగా అరచేతిలో కనిపించిన అక్షరాలు.. ఇంతకీ ఆమె ఏం రాసుకుందంటే..

ABN, First Publish Date - 2022-07-07T23:48:57+05:30

ఎవరికీ, ఏ సంబంధం లేదంటూ సూసైడ్ నోట్ రాస్తూ.. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఇలాంటి కేసుల్లో కొన్నిసార్లు చివరకు అనూహ్య పరిణామాలు చోటు..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎవరికీ, ఏ సంబంధం లేదంటూ సూసైడ్ నోట్ రాస్తూ.. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఇలాంటి కేసుల్లో కొన్నిసార్లు చివరకు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటుంటాయి. ఇంకొందరు మహిళలు.. వివాహేతర సంబంధాల కారణంగానో లేక భర్త చిత్రహింసలు పెడుతున్నాడనే కారణంతో చివరకు ఊహించని నిర్ణయాలు తీసుకుంటుంటారు. బీహార్‍‌లో ఓ మహిళ ఇలాగే అనూహ్య నిర్ణయం తీసుకుంది. రైల్వే ట్రాక్‌పై మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్లూ కోసం వెతుకుతుండగా.. ఆమె అరచేతిలో అక్షరాలు కనిపించాయి. వివరాల్లోకి వెళితే..


బీహార్ రాష్ట్రం మధుబని పరిధి ఇనర్వ గోత్ గ్రామంలో నిరింకు కుమారి(28), మనోజ్ పాశ్వాన్‌ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 2012లో వివాహమైంది. ఇదిలావుండగా, ఏమైందో ఏమో గానీ బుధవారం రాత్రి స్థానికంగా ఉన్న రైల్వే ట్రాక్‌పై నిరింకు కుమారి శవమై కనిపించింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూ కోసం చూస్తుండగా, మృతురాలి అర చేతిపై అక్షరాలు కనిపించాయి.

స్నేహితురాలితో కలిసి చెరువు వద్ద స్నానం చేస్తున్న బాలిక.. ఇంటికి రాగానే ఊహించని ఘటన.. చివరకు ఆమె తీసుకున్న నిర్ణయం..


అందులో ఆమె పేరుతో పాటూ చిరునామా రాసి, ‘‘ నా ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదు.. నేను పోయిన తర్వాత ఎవరికీ ఎలాంటి సమస్యా ఉండకూడదు’’.. అని పెన్నుతో రాసి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆమె రాసిన చిరునామా ఆధారంగా.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆమె నిజంగానే ఆత్మహత్య చేసుకుందా.. లేదా ఇంకెవరైనా ఆమెను హత్య చేసి, రైల్వే ట్రాక్‌పై పడేశారా.. అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

అమ్మా! మీ అల్లుడు ఎవరో బాలికను ఇంటికి తీసుకొచ్చాడని చెప్పిన కూతురు.. మరుక్షణమే ఫోన్ కట్.. తీరా ఇంటికి వెళ్లి చూస్తే..

Updated Date - 2022-07-07T23:48:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising