Viral Video: నడిరోడ్డుపై Dangerous Stunts తో ఓ కుర్రాడి పిచ్చి చేష్టలు.. బైక్‌పై వెళ్తూ సడన్‌గా సీట్‌పై నుంచి పక్కకు దిగి మరీ..
ABN, First Publish Date - 2022-06-29T22:55:24+05:30
ప్రస్తుత సమాజంలో కొందరు యువకులు.. సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే ఉద్దేశంతో చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు. ఈ క్రమంలో తాము ప్రమాదాలకు గురవడమే కాకుండా.. పక్కన వారికి కూడా అపాయం...
ప్రస్తుత సమాజంలో కొందరు యువకులు.. సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే ఉద్దేశంతో చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు. ఈ క్రమంలో తాము ప్రమాదాలకు గురవడమే కాకుండా.. పక్కన వారికి కూడా అపాయం తలపెడుతుంటారు. మరికొందరు యువకులు.. డేంజరస్ స్టంట్స్ చేస్తూ నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు కూడా.. పిచ్చి పట్టినట్లు నడి రోడ్డుపై డేంజరస్ స్టంట్స్ చేశాడు. బైక్‌పై వెళ్తూనే సీటు పైనుంచి పక్కకు దిగి మరీ స్టంట్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు యువకుడిపై మండిపడుతున్నారు.
ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలోని ఎంజీ రోడ్డులో వాహనాలు రద్దీగా తిరుగుతున్నాయి. ఈ సమయంలో ఓ యువకుడు బైకుపై వేగంగా దూసుకొచ్చాడు. అంతటితో ఆగకుండా వెళ్తూ వెళ్తూ బైకు సీటు నుంచి దిగి.. ఫుట్ స్టాండ్‌పై నిలబడి డ్రైవ్ చేశాడు. మళ్లీ బైకుపై కూర్చుని అటూ ఇటూ వంకర్లు తిప్పుతూ బైకు నడపడం చూసి.. మిగతా వాహనదారులు షాక్ అయ్యారు. ఆ రోడ్డు సుమారు ఏడు కిలోమీటర్ల పొడవు ఉండడంతో పాటూ మధ్యలో 15కూడళ్లు ఉన్నాయి.
విమానం నుంచి సరస్సుల్లోకి దూకుతున్న చేపలు... ఇంతకీ అసలు విషయం ఏంటంటే..
ఇలాంటి యువకుల నిర్లక్ష్యం కారణంగా పక్కన వారు కూడా ప్రమాదంలో పడతారని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ స్టంట్ చేసిన యువకుడు.. కీ మండి అనే కూడలి నుంచి హరి పర్వత్ వరకూ ఇలా విన్యాసాలు చేస్తూ వెళ్లాడని వాహనదారులు తెలిపారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ సిటీ వికాస్‌కుమార్.. ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.
వామ్మో! ఈ బామ్మకు ఏం ధైర్యం.. అంతెత్తు నుంచి అమాంతం దూకేసింది.. ఆశ్యర్యపోతున్న నెటిజన్లు..
Updated Date - 2022-06-29T22:55:24+05:30 IST