వాయిస్ బాగుందని యువతిని తన భజన బృందంలో చేర్చుకున్నాడు.. ఓ రోజు ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి లవ్ ప్రపోజ్ చేశాడు.. ఆరు నెలల తర్వాత చూస్తే..
ABN, First Publish Date - 2022-06-19T02:16:29+05:30
ఒక్కోసారి కొందరి అవసరాన్ని ఇంకొందరు అవకాశంగా తీసుకుంటుంటారు. ఈ క్రమంలో చాలా మంది అమాయకులు మోసపోతుంటారు. ఇలాంటి వారిలో మహిళలే ఎక్కువగా ఉండడం రోజూ...
ఒక్కోసారి కొందరి అవసరాన్ని ఇంకొందరు అవకాశంగా తీసుకుంటుంటారు. ఈ క్రమంలో చాలా మంది అమాయకులు మోసపోతుంటారు. ఇలాంటి వారిలో మహిళలే ఎక్కువగా ఉండడం రోజూ చూస్తూనే ఉన్నాం. ఉద్యోగం కోసమో, ఆర్థిక సమస్యల కారణంగానో.. చాలా మంది మహిళలు మోసగాళ్లను నమ్మి చివరకు జీవితాలను నాశనం చేసుకుంటుంటారు. మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. యువతి వాయిస్ బాగుండడంతో ఓ గాయకుడు.. ఆమెను తన భజన బృందంలో చేర్చుకున్నాడు. ఓ రోజు ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి లవ్ ప్రపోజ్ చేశాడు. చివరికి ఆరు నెలల తర్వాత ఏం జరిగిందంటే..
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ పరిధిలో నివాసం ఉంటున్న మూల్‌సింగ్ చౌహాన్ అనే యువకుడు.. భజన కార్యక్రమాలు నిర్వహిస్తూ పాటలు పాడుతుంటాడు. ఈ క్రమంలో అతడికి స్థానిక ప్రాంతానికి చెందిన ఓ యువతి పరిచయమైంది. ఆమె వాయిస్ బాగుండడంతో తన భజన బృందంలో చేరమని అడిగాడు. యువతికి పాటలు పాడటం ఇష్టం ఉండడంతో వెంటనే అతడి మాటకు ఓకే చెప్పింది. అప్పటి నుంచి మూల్‌సింగ్ బృందంలో పాటలు పాడుతుండేది. ఈ క్రమంలో ఓ రోజు ఆమెను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి లవ్ ప్రపోజ్ చేశాడు. ఇద్దరిదీ ఒకే వృత్తి కావడం, అందులోనూ పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో యువతి కూడా అతన్ని ప్రేమించింది. ఇలా పెళ్లి పేరుతో ఆమెపై రోజూ రాసలీలలు సాగించేవాడు.
వారిద్దరూ ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.. కానీ చివరకు ఒకే ఒక్క కారణంతో..
పెళ్లి చేసుకోమని అడిగినప్పుడల్లా ఏదో ఒక సాకు చెబుతూ ఉండేవాడు. ఇలా ఆరు నెలల పాటు నెట్టుకొచ్చాడు. దీంతో యువతికి విసుగొచ్చి.. గత బుధవారం మళ్లీ అతడి వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చింది. దీంతో ఆగ్రహించిన అతను.. ఇంకోసారి పెళ్లి మాట ఎత్తితే చంపేస్తానని బెదిరించాడు. మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. అనంతరం అతన్ని జైలుకు తరలించారు. ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
భార్యకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నో రెస్పాన్స్.. ఇంటికి వెళ్లాక అనుమానంతో రహస్యంగా ఆమె వాట్సప్ చాటింగ్‌ను చూసిన భర్తకు..
Updated Date - 2022-06-19T02:16:29+05:30 IST