అర్ధరాత్రి రోడ్డుపై వెళ్తున్న యువతులను చూసి కామెంట్ చేశాడు.. చివరకు వాళ్ల రియాక్షన్ చూసి ఖంగుతిన్న యువకుడు..
ABN, First Publish Date - 2022-07-07T00:46:41+05:30
అనుకున్నది ఒకటి.. అయ్యింది మరోటి అన్న చందంగా, కొన్నిసార్లు అన్నీ తలకిందులవుతుంటాయి. బలహీనులు అనుకున్నవారు.. అప్పుడప్పుడూ అనూహ్యంగా..
అనుకున్నది ఒకటి.. అయ్యింది మరోటి అన్న చందంగా, కొన్నిసార్లు అన్నీ తలకిందులవుతుంటాయి. బలహీనులు అనుకున్నవారు.. అప్పుడప్పుడూ అనూహ్యంగా తిరగబడడం చూస్తుంటాం. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఛత్తీస్‌గఢ్‌లో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి ఇద్దరు యువతులు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒంటరిగా దొరికారని.. ఓ యువకుడు అసభ్యకరంగా కామెంట్ చేశాడు. దీంతో యువతులకు ఒక్కసారిగా చిర్రెత్తుకొచ్చింది. మరుక్షణం వాళ్ల రియాక్షన్ చూసి.. యువకుడు ఖంగుతిన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో.. వైరల్ అవుతోంది...
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్‌పూర్‌లోని సివిల్ లైన్ ఏరియాలోని మహారాణా ప్రతాప్ చౌక్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి ఇద్దరు యువతులు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే సమయంలో కొందరు యువకులు ఫుల్‌గా మందు కొట్టి, బైకులపై అటుగా వెళ్లారు. యువతులను చూసి ఓ యువకుడు అసభ్యకరంగా కామెంట్ చేశాడు. దీంతో యువతులకు విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే ఓ యువతి.. యువకుడి కాలర్ పట్టుకుని రోడ్డు పైకి లాక్కెళ్లింది. దీంతో ఖంగుతిన్న మిగతా యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. తర్వాత కామెంట్ చేసిన యువకుడిపై పిడిగుద్దులు కురిపించారు. దీంతో భయపడిపోయిన యువకుడు.. చివరకు క్షమించండి అంటూ వేడుకున్నాడు. అయినా యువతులు అతన్ని వదలకుండా చితకబాదారు.
అమ్మా! మీ అల్లుడు ఎవరో బాలికను ఇంటికి తీసుకొచ్చాడని చెప్పిన కూతురు.. మరుక్షణమే ఫోన్ కట్.. తీరా ఇంటికి వెళ్లి చూస్తే..
ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదని పోలీసులు తెలిపారు. దీనిపై స్థానికులు మాట్లాడుతూ.. ఘటన జరిగిన సమయంలో యువతులు కూడా మద్యం సేవించి ఉన్నారని ఆరోపించారు. నగరంలో మద్యం షాపులు, బార్లు.. అర్ధరాత్రి వరకూ తెరిచే ఉన్నాయన్నారు. దీంతో యువతీయువకులు వేకువజాము వరకూ ఫుల్‌గా తాగుతూ వీరంగం సృష్టిస్తున్నారని, దీనిపై పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
రోడ్డుపై ఎదురు చూస్తున్నా తొందరగా వచ్చేయ్.. అని భార్యకు పోన్ చేశాడు.. తీరా దగ్గరికి వచ్చాక.. అంతా చూస్తుండగా ఒక్కసారిగా..
Updated Date - 2022-07-07T00:46:41+05:30 IST