ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

robbery: సంచి నిండా cash ఉందనుకుని.. బెదిరించి మరీ లాక్కెళ్లారు.. బాధితుడు చెప్పింది విని అవాక్కయిన పోలీసులు..

ABN, First Publish Date - 2022-07-13T23:06:13+05:30

కొన్నిసార్లు ఒకటి అనుకుంటే.. చివరకు ఇంకోటి జరుగుతుంటుంది. ఇందుకు సంబంధించిన వార్తలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ఇలాంటి ఘటనే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొన్నిసార్లు ఒకటి అనుకుంటే.. చివరకు ఇంకోటి జరుగుతుంటుంది. ఇందుకు సంబంధించిన వార్తలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ యువకుడు సంచి పట్టుకుని బైకులో వెళ్తున్నాడు. అందులో నగదు ఉంటుందనుకుని.. కొందరు దండగులు కాపుకాచారు. చివరకు యువకుడిని బెదిరించి మరీ.. సంచిని ఎత్తుకెళ్లారు. అయితే చివరకు బాధితుడు చెప్పింది విని పోలీసులు అవాక్కయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీలో జూలై 7న ఈ ఘటన చోటు చేసుకుంది. ఉన్నావ్ గేట్ సమీపంలో నివసించే కునాల్ మిషన్ కాంపౌండ్‌లో నివాసం ఉంటున్న రవి అనే వ్యక్తి బైకులో సంచి పట్టుకుని రాత్రి సమయంలో వెళ్తున్నాడు. మార్గమధ్యలో బాలాజీ రోడ్డుపై ముగ్గురు అగంతకులు బైక్‌పై వచ్చారు. రవిని ఆపి, బ్యాగు తమకు అప్పగించాలని బెదిరించారు. వినకపోవడంతో దాడి చేసి మరీ సంచిని ఎత్తుకెళ్లారు. అందులో ఎలాంటి నగదూ లేదని యువకుడు.. పదే పదే చెప్తున్నా వినకుండా దండగులు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో బాధితుడు నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. అసలు విషయం తెలుసుకున్న పోలీసులు అవాక్కయ్యారు.

Divorce తీసుకున్నాను.. ఒక పాప కూడా ఉందన్న మహిళ.. అయినా సరే! పెళ్లి చేసుకుంటానని చెప్పిన యువకుడు.. అద్దె గది తీసుకుని..


బాధితుడు రవి ఫిర్యాదు మేరకు.. అతను ఓ డాగీ అనే కుక్క పిల్లను పెంచుకుంటున్నాడు. అయితే అది సడన్‌గా అనారోగ్యానికి గురైంది. దీంతో వైద్యం చేయించేందుకు.. కుక్క పిల్లను సంచిలో పెట్టుకుని, స్కూటీపై ఆస్పత్రికి బయలుదేరాడు. అయితే అందులో నగదు ఉందనుకుని.. దుండగులు బలవంతంగా ఎత్తుకెళ్లారు. ఎలాగైనా తన కుక్క పిల్లను తనకు అప్పగించాలని యువకుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించి, దుండగుల కోసం గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: సముద్రపు ఒడ్డున ఎంజాయ్ చేస్తున్న సమయంలో.. యువతుల నిర్లక్ష్యం ఎంత పని చేసింది.. అంత చూస్తుండగా..

Updated Date - 2022-07-13T23:06:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising