ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pat Cummins: ఐపీఎల్‌పై కీలక నిర్ణయం తీసుకున్న పాట్ కమిన్స్

ABN, First Publish Date - 2022-11-15T19:03:56+05:30

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)పై ఆస్ట్రేలియన్ కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) కీలక నిర్ణయం తీసుకున్నాడు. గత మూడు సీజన్లలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెల్‌బోర్న్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)పై ఆస్ట్రేలియన్ కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) కీలక నిర్ణయం తీసుకున్నాడు. గత మూడు సీజన్లలో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కమిన్స్ ఈసారి ఐపీఎల్‌లో ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. అంతర్జాతీయ షెడ్యూల్స్ ఎక్కువగా ఉండడం వల్లే కమిన్స్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇంటర్నేషనల్ షెడ్యూల్స్ ఫుల్ ప్యాక్ అయిపోయి ఉండడంతో వచ్చే ఏడాది ఐపీఎల్‌ నుంచి తప్పుకుంటున్నట్టు కమిన్స్ స్పష్టం చేశాడు.

ఇది చాలా కఠినమైన నిర్ణయమే అయినా తప్పడం లేదని కమిన్స్ పేర్కొన్నాడు. వచ్చే 12 నెలలు టెస్టులు, వన్డేలతో షెడ్యూళ్లతో బిజీగా ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. యాషెస్ సిరీస్, పరపంచకప్‌కు ముందు కొంత విశ్రాంతి తీసుకుంటానని కమిన్స్ పేర్కొన్నాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ నుంచి బయటకు రావాలన్న తన నిర్ణయాన్ని అర్థం చేసుకున్నందుకు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ధన్యవాదాలు తెలిపాడు.

కమిన్స్ 2014లో కేకేఆర్‌ జట్టులో చేరాడు. అయితే, 2014, 2015 సీజన్లలో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 2017లో ఢిల్లీ కేపిటల్స్ (Delhi Capitals)కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత మళ్లీ కోల్‌కతాకు వచ్చేశాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో పుణెలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కమిన్స్ 14 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి రికార్డులకెక్కాడు. వచ్చే ఏడాది జూన్‌లో జరగనున్న యాషెస్ సిరీస్‌లో ఆసీస్ జట్టును కమిన్స్ ముందుండి నడిపించనున్నాడు. అలాగే, అదే ఏడాది అక్టోబరు, నవంబరులో ఐసీసీ పురుషుల ప్రపంచకప్ జరగనుంది. టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా ప్రస్తుతం టాప్‌లో ఉంది. దీంతో వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో ఆడే అవకాశం ఉంది. వచ్చే ఏడాది మొదట్లో భారత్‌లో జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్‌తో టెస్టు చాంపియన్‌షిప్‌లో రెండో స్థానం ఎవరిదనేది తేలిపోతుంది. వారు ఫైనల్‌లో తలపడతారు.

Updated Date - 2022-11-15T19:03:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising