FIFA WorldCup2022: ఫిఫా వరల్డ్ కప్ ఆరంభానికి 2 రోజుల ముందు ఖతార్ అనూహ్య నిర్ణయం..
ABN, First Publish Date - 2022-11-18T19:24:23+05:30
ఫిఫా వరల్డ్ కప్ 2022 (FIFA World cup2022) టోర్నమెంట్ ఆరంభానికి 2 రోజుల ముందు ఆతిథ్య దేశం ఖతార్ (Qatar) కీలక నిర్ణయం తీసుకుంది.
దోహా: ఫిఫా వరల్డ్ కప్ 2022 (FIFA World cup2022) టోర్నమెంట్ ఆరంభానికి 2 రోజుల ముందు ఆతిథ్య దేశం ఖతార్ (Qatar) కీలక నిర్ణయం తీసుకుంది. వరల్డ్ కప్ మ్యాచ్‌లకు ఆతిథ్యమివనున్న 8 స్టేడియాల పరిసరాల్లో బీర్ విక్రయాలను (Beer sales) నిషేధించింది. ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య ఫిఫా (FIFA), ఖతార్ ప్రభుత్వాలు ఉమ్మడిగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. మద్యపానంపై (alcohol consumption) కఠినంగా వ్యవహరించే ఇస్లామిక్ దేశమైన ఖతార్‌తో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫిఫా ప్రకటించింది. ఫిఫా వరల్డ్ కప్ 2022 జరగనున్న స్టేడియాల పరిసరాల్లో బీర్ సేల్స్ పాయింట్లను తొలగించనున్నట్టు తెలిపింది. ఆదివారం ఖతార్ వర్సెస్ ఈక్వెడార్ (Qatar Vs Ecuador) మధ్య మ్యాచ్ జరగనుండడంతో ఇప్పటికే స్టేడియం వద్ద డజన్ల కొద్ది బీర్ సేల్ పాయింట్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
కాగా 29 రోజులపాటు కొనసాగనున్న ఫిఫా వరల్డ్ కప్ సందర్భంగా 10 లక్షలకుపైగా మంది ఫ్యాన్స్ తమ దేశాన్ని సందర్శిస్తారని ఖతార్ అంచనా వేస్తోంది. అందుకే ప్రధాన బీరు ఉత్పత్తిదారైన బడ్‌వైజర్‌తో (Budweiser) ఒప్పందం కూడా కుదుర్చుకుంది. కాగా మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. బీర్ సేల్స్ పాయింట్లను తొలగిస్తున్నప్పటికీ స్టేడియాల్లోని వీఐపీ సూట్స్‌లో బీర్ లభ్యమవుతుంది. ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య పాలనా మండలి ఈ బీర్‌ను విక్రయించనుంది. కాగా దోహాలోని ఫిఫా ఫ్యాన్ జోన్‌లో కొన్ని ప్రైవేటు ఫ్యాన్స్ జోన్స్, 35 హోటల్స్, రెస్టారెంట్ బార్స్ ఉన్నాయి.
Updated Date - 2022-11-18T19:25:35+05:30 IST