ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Brazil : బ్రెజిల్‌.. ధనాధన్‌

ABN, First Publish Date - 2022-12-07T00:50:34+05:30

ఐదుసార్లు విశ్వవిజేత బ్రెజిల్‌ తనదైన శైలిలో విరుచుకుపడింది. 40 నిమిషాలలోపే నాలుగు గోల్స్‌ కొట్టిన సాంబా టీమ్‌.. ఫస్టాఫ్‌లోనే మ్యాచ్‌ను ప్రత్యర్థి నుంచి లాగేసుకొంది. సోమవారం అర్ధరాత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

4-1తో కొరియా చిత్తు

గ్రాండ్‌ విక్టరీతో క్వార్టర్స్‌కు సాంబా టీమ్‌

నెమార్‌ రీఎంట్రీ

ఫిఫా వరల్డ్‌కప్‌

మూడు వేర్వేరు వరల్డ్‌కప్‌ల్లో గోల్‌ చేసిన బ్రెజిల్‌ ఆటగాడిగా పీలే, రొనాల్డో సరసన నెమార్‌.

బ్రెజిల్‌ తరఫున అత్యధిక గోల్స్‌ చేసిన పీలే (77) రికార్డు సమం చేసేందుకు ఒక గోల్‌ దూరంలో నిలిచాడు నెమార్‌.

దోహా: ఐదుసార్లు విశ్వవిజేత బ్రెజిల్‌ తనదైన శైలిలో విరుచుకుపడింది. 40 నిమిషాలలోపే నాలుగు గోల్స్‌ కొట్టిన సాంబా టీమ్‌.. ఫస్టాఫ్‌లోనే మ్యాచ్‌ను ప్రత్యర్థి నుంచి లాగేసుకొంది. సోమవారం అర్ధరాత్రి ఏకపక్షంగా సాగిన రౌండ్‌-16 మ్యాచ్‌లో బ్రెజిల్‌ 4-1తో దక్షిణ కొరియాను చిత్తు చేసి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. వినిసియస్‌ జూనియర్‌ (7వ నిమిషం), నెమార్‌ (13వ), రిచర్లిసన్‌ (29వ), లూకస్‌ పక్వెటా (36వ) గోల్స్‌ చేయగా.. కొరియా తరఫున పైక్‌ సుయింగ్‌ హో (76వ) ఓ గోల్‌ సాధించాడు. గాయం నుంచి కోలుకొని ఈ మ్యాచ్‌లో నెమార్‌ బరిలోకి దిగడంతో టీమ్‌లో జోష్‌ పెరిగింది. శుక్రవారం జరిగే క్వార్టర్స్‌ మ్యాచ్‌లో క్రొయేషియాతో బ్రెజిల్‌ అమీతుమీ తేల్చుకోనుంది.

వార్‌ వన్‌సైడే..: బ్రెజిల్‌ గెలుపుపై ఎటువంటి సందేహం లేదు. కానీ, గొప్ప పోరాట స్ఫూర్తితో నాకౌట్‌కు చేరుకొన్న కొరియా.. సాంబా జట్టుకు గట్టి సవాలే విసురుతుందని భావించారు. అయితే, మ్యాచ్‌ ఆరంభమైన కొద్ది నిమిషాలకే ఫలితం అర్థమైంది. బెంబేలెత్తించే బ్రెజిల్‌ అటాకింగ్‌ గేమ్‌ ముందు కొరియా వెలవెలబోయింది. 7వ నిమిషంలో రఫీనా కొట్టిన క్రాస్‌ను వినిసియస్‌ కూల్‌గా నెట్‌లోకి పంపి గోల్స్‌ జాతరకు తెరలేపాడు. కొద్ది నిమిషాల తర్వాత రిచర్లిసన్‌ను కొరియా ఆటగాడు మొరటుగా అడ్డుకోవడంతో రిఫెరీ పెనాల్టీ కిక్‌ ఇచ్చాడు. దీన్ని నెమార్‌ చాలా తెలివిగా గోల్‌లోకి పంపి బ్రెజిల్‌ను 2-0 ఆధిక్యంలో నిలిపాడు. ఇక, 29వ నిమిషంలో థియాగో సిల్వ ఇచ్చిన పాస్‌ను పెనాల్టీ ఏరియాలో అందుకొన్న రిచర్లిసన్‌ నేరుగా గోల్‌లోకి పంపాడు. మరో ఏడు నిమిషాల తర్వాత వినిసియన్‌ కొట్టిన స్కూప్‌ కిక్‌ను పక్వెటా నేరుగా నెట్‌లోకి కొట్టాడు. దీంతో 4-0తో తిరుగులేని స్థితిలో నిలిచిన బ్రెజిల్‌ బ్రేక్‌కు వెళ్లింది. అయితే, సెకండాఫ్‌లో కొరియా కొంత మెరుగైన ఆటను ప్రదర్శిస్తూ.. బ్రెజిల్‌ను మరో గోల్‌ చేయకుండా అడ్డుకొంది. 76వ నిమిషంలో పైక్‌ సుయింగ్‌ హో అద్భుతమైన షాట్‌తో కొరియాకు ఓదార్చు గోల్‌ను అందించాడు. కాగా, ఈ ఓటమితో కొరియా టోర్నీ నుంచి అవుట్‌ కావడంతో.. ఆ టీమ్‌ కోచ్‌ పౌలో బెంటో కూడా తన పదవి నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించాడు. గోల్‌ కొట్టిన ప్రతీసారి బ్రెజిల్‌ ఆటగాళ్లు డాన్సులు వేస్తూ సంబరాలు చేసుకోగా.. ఆ టీమ్‌ కోచ్‌ టిటే కూడా ఆటగాళ్లతో కలసి స్టెప్పులేయడం విశేషం.

నిద్రలేని రాత్రులు గడిపా..: నెమార్‌

గాయపడిన నెమార్‌.. వరల్డ్‌క్‌పనకు పూర్తిగా దూరం అవుతాడని భావించారు. కానీ, ఏదో మాయ జరిగినట్టు కాలి గాయం నుంచి కోలుకొన్న అతడు కొరియాతో మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. ‘అంతా అయిపోయిందని ఎంతో బాధపడ్డా. ఏడుస్తూనే నిద్రలేని రాత్రులు గడిపా. కొరియాతో మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు వరకు కూడా చికిత్స తీసుకొంటూనే ఉన్నాన’ని నెమార్‌ చెప్పాడు.

పీలేకు అంకితం

మ్యాచ్‌ అనంతరం కొరియాపై సాధించిన ఘన విజయాన్ని.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాకర్‌ దిగ్గజం పీలేకు బ్రెజిల్‌ జట్టు అంకితమిచ్చింది. పీలే పేరుతో ఉన్న బ్యానర్‌ను టీమ్‌ ఆటగాళ్లు ప్రదర్శిస్తూ గ్రూప్‌ ఫొటోలు దిగారు. పీలే త్వరగా కోలుకోవాలని నెమార్‌ ప్రార్థించాడు. స్టేడియంలో పలువురు బ్రెజిల్‌ అభిమానులు పీలేకు గుర్తుగా నెం:10 జెర్సీలు ధరించారు. కాగా, పీలే కోసం బ్రెజిల్‌ ఆటగాళ్లు చేసినట్టుగా.. మారడోనాకు అర్జెంటీనా టీమ్‌ నివాళులర్పించలేదని అతడి కుమార్తె జియన్నినా విమర్శలు చేసింది.

Updated Date - 2022-12-07T00:50:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising