ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

England : సెమీస్‌కు ఇంగ్లండ్‌

ABN, First Publish Date - 2022-11-06T05:49:50+05:30

టీ20 వరల్డ్‌క్‌పలో ఇంగ్లండ్‌ సెమీస్‌ బెర్త్‌ను దక్కించుకోగా.. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా కథ ముగిసింది. సూపర్‌-12లో భాగంగా గ్రూప్‌-1లో శనివారం జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 4 వికెట్ల తేడాతో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసీస్‌ అవుట్‌ లంకపై బట్లర్‌ సేన విజయం

సిడ్నీ: టీ20 వరల్డ్‌క్‌పలో ఇంగ్లండ్‌ సెమీస్‌ బెర్త్‌ను దక్కించుకోగా.. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా కథ ముగిసింది. సూపర్‌-12లో భాగంగా గ్రూప్‌-1లో శనివారం జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 4 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఉత్కంఠ విజయం సాధించింది. దీంతో మొత్తం 7 పాయింట్లతో ఆస్ట్రేలియాతో సమంగా నిలిచినా.. ఇంగ్లండ్‌ మెరుగైన రన్‌రేట్‌ కారణంగా గ్రూప్‌లో రెండో స్థానంతో నాకౌట్‌కు చేరుకొంది. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన ఆసీస్‌, శ్రీలంక సెమీస్‌ చేరకుండానే ఇంటిముఖం పట్టాయి. స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ (36 బంతుల్లో 42 నాటౌట్‌) సమయోచిత ఇన్నింగ్స్‌తో.. లంక నిర్దేశించిన 142 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హసరంగ, డిసిల్వ, లాహిరు కుమార తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఓ మాదిరి లక్ష్యం కోసం బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు బట్లర్‌ (28), అలెక్స్‌ హేల్స్‌ (30 బంతుల్లో 47) అదిరే ఆరంభాన్నిచ్చారు. ఫామ్‌లో ఉన్న బట్లర్‌ స్పిన్నర్‌ హసరంగ బౌలింగ్‌లో 4,6తో బ్యాట్‌ను ఝుళిపించాడు.

ఇక, రజిత వేసిన ఆరో ఓవర్‌లో శివాలెత్తిన హేల్స్‌ సిక్స్‌, 3 ఫోర్లు కొట్టడంతో.. పవర్‌ప్లే ముగిసేసరికి ఇంగ్లండ్‌ 70/0తో అలవోకగా నెగ్గేలా కనిపించింది. కానీ, బట్లర్‌, హేల్స్‌ను హసరంగ స్వల్ప తేడాతో పెవిలియన్‌ చేర్చడంతో ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ తడబడింది. ఈ దశలో పుంజుకొన్న లంక బౌలర్లు బ్రూక్స్‌ (4), లివింగ్‌స్టోన్‌ (4), మొయిన్‌ అలీ (1), కర్రాన్‌ (6)లను పెవిలియన్‌ చేర్చారు. కానీ, మరో ఎండ్‌లో ఉన్న స్టోక్స్‌ పరిస్థితులకు తగ్గట్టుగా ఆడుతూ జట్టును గెలుపు దిశగా నడిపించాడు. ఆఖరి ఓవర్‌లో విజయానికి 5 రన్స్‌ కావాల్సి ఉండగా.. వోక్స్‌ (5 నాటౌట్‌) ఫోర్‌తో మ్యాచ్‌ను ఫినిష్‌ చేశాడు. అంతకుముందు లంక 20 ఓవర్లలో 141/8 స్కోరు చేసింది. పవర్‌ప్లేలో ఓపెనర్‌ నిస్సాంక (67) చెలరేగినా.. మధ్య, డెత్‌ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. లంక స్కోరుకు పగ్గాలేసింది. దీంతో ఆఖరి 4 ఓవర్లలో లంక 25 పరుగులే రాబట్టింది. 20వ ఓవర్‌లో మార్క్‌ ఉడ్‌ 3 వికెట్లు పడగొట్టాడు. ఆదిల్‌ రషీద్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ దక్కింది.

సంక్షిప్త స్కోర్లు:

శ్రీలంక: 20 ఓవర్లలో 141/8 (నిస్సాంక 67, రాజపక్సే 22; మార్క్‌ ఉడ్‌ 3/26, రషీద్‌ 1/16);

ఇంగ్లండ్‌: 19.4 ఓవర్లలో 144/6 (హేల్స్‌ 47, స్టోక్స్‌ 42 నాటౌట్‌; హసరంగ 2/23, డిసిల్వ 2/24).

Updated Date - 2022-11-06T05:55:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising