ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

India vs England :సమరానికి సై

ABN, First Publish Date - 2022-11-10T05:56:55+05:30

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మరోసారి టీ20 వరల్డ్‌కప్‌ టైటిల్‌ ఫైట్‌లో తలపడేందుకు టీమిండియా ఇంకో మ్యాచ్‌ దూరంలో ఉంది. గురువారం జరిగే బ్లాక్‌ బస్టర్‌ సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్‌ అమీతుమీ తేల్చుకోనుంది.

India vs England
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మధ్యాహ్నం 1.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో..

సెమీస్‌లో ఇంగ్లండ్‌తో భారత్‌ ఢీ నేడు

కోహ్లీ, సూర్యపై భారీ ఆశలు

ఫిట్‌గా రోహిత్‌

ఈ వేదికపై గత 11 మ్యాచ్‌ల్లో టాస్‌ గెలిచిన జట్లు ఓటమి పాలయ్యాయి.

టీ20ల్లో వంద సిక్స్‌ల క్లబ్‌లో చేరడానికి కేఎల్‌ రాహుల్‌కు కావాల్సిన సిక్స్‌లు.

టీ20ల్లో 4 వేల పరుగుల మైలురాయి చేరిన తొలి బ్యాటర్‌గా నిలిచేందుకు విరాట్‌ కోహ్లీకి కావాల్సిన పరుగులు.

అడిలైడ్‌: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మరోసారి టీ20 వరల్డ్‌కప్‌ టైటిల్‌ ఫైట్‌లో తలపడేందుకు టీమిండియా ఇంకో మ్యాచ్‌ దూరంలో ఉంది. గురువారం జరిగే బ్లాక్‌ బస్టర్‌ సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్‌ అమీతుమీ తేల్చుకోనుంది. గ్రూప్‌ దశలో ఇంగ్లండ్‌తో పోల్చితే టీమిండియాదే మెరుగైన ప్రదర్శన. కానీ, కీలక మ్యాచ్‌ నేపథ్యంలో ఏ జట్టునూ తేలిగ్గా తీసుకొనే పరిస్థితి లేదు. పైగా 2013 నుంచి చూసుకొంటే ఐసీసీ ఈవెంట్లలో సెమీస్‌, ఫైనల్లో భారత్‌కు చుక్కెదురవుతూనే ఉంది. 2014 టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్లో టీమిండియాకు షాక్‌ తగలగా.. 2016 టీ20 వరల్డ్‌కప్‌ సెమీస్‌, 2017 చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌, 2019 వన్డే వరల్డ్‌కప్‌ సెమీ్‌సను భారత్‌ దాటలేక పోయింది. ఈ అన్ని టోర్నీల్లోనూ సభ్యుడిగా ఉన్న రోహిత్‌ శర్మ.. ఇప్పుడు కెప్టెన్‌గా జట్టును నడిపిస్తున్నాడు. ఈసారి మాత్రం జట్టును విశ్వవిజేతగా నిలపాలన్న పట్టుదలతో ఉన్నాడు. అయితే, ఈ మెగా ఈవెంట్‌లో రోహిత్‌ ఫామ్‌లో లేకపోవడం జట్టును కలవర పెడుతోంది. సెమీ్‌సకు ముందు నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తూ గాయపడినా.. తాను ఫిట్‌గానే ఉన్నానని స్పష్టం చేశాడు. ఓపెనర్‌ రాహుల్‌ రెండు అర్ధ శతకాలతో టచ్‌లోకి వచ్చినా.. అతడిపై జట్టు భారీ అంచనాలు పెట్టుకోలేక పోతోంది. తనకు అచ్చొచ్చిన అడిలైడ్‌లో మరోసారి సత్తా చాటడానికి విరాట్‌ చూస్తుండగా.. బౌలర్లకు సింహ స్వప్నంగా మారిన సూర్య కూడా బిగ్‌ మ్యాచ్‌ ప్లేయర్‌గా తనదైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. భువీ, షమి, అర్ష్‌దీ్‌పల పేస్‌ త్రయం నిలకడగా రాణిస్తున్నా.. స్పిన్‌ విభాగం బలహీనంగా కనిపిస్తోంది.

పంత్‌, కార్తీక్‌లో ఎవరు?

లీగ్‌ దశలో నాలుగు మ్యాచ్‌లు నెగ్గినా.. రిషభ్‌ పంత్‌, దినేష్‌ కార్తీక్‌ విషయంలో జట్టు మేనేజ్‌మెంట్‌ ఒక నిర్ణయానికి రాలేకపోతోంది. ఫినిషర్‌ పాత్రకు కార్తీక్‌ను ఎంపిక చేసినా అతడు ఆశించినమేర ఆడలేక పోయాడు. జింబాబ్వేతో మ్యాచ్‌లో పంత్‌ను తుది జట్టులోకి తీసుకొన్నా విఫలమయ్యాడు. ఈ విషయంలో రోహిత్‌ కూడా స్పష్టత ఇవ్వకపోవడంతో ఈ సస్పెన్స్‌ మ్యాచ్‌ ముందు వరకు కొనసాగే అవకాశం ఉంది. ఇక, బౌలర్‌గా అక్షర్‌ పటేల్‌ భారీగా పరుగులు సమర్పించుకొంటున్నా.. కెప్టెన్‌ మాత్రం అతడికి మద్దతుగా నిలుస్తున్నాడు. హార్దిక్‌ పాండ్యా మెరుపులు మెరిపించాల్సి ఉంది.

తడబడుతూనే..

పేపర్‌పై బలంగా కనిపిస్తున్నా.. ఇంగ్లండ్‌ తడబడుతూనే సెమీ్‌సకు చేరింది. అయితే, ప్రధాన బౌలర్‌ మార్క్‌ వుడ్‌, మలన్‌ గాయపడడం పెద్ద దెబ్బ. డెత్‌లో సామ్‌ కర్రాన్‌ అద్భుతంగా రాణిస్తుండడం ఊరటనిచ్చే అంశం. ఓపెనర్లు బట్లర్‌, అలెక్స్‌ హేల్స్‌ టచ్‌లో ఉండగా.. స్టోక్స్‌, లివింగ్‌స్టోన్‌ రాణిస్తే ఎంత భారీ స్కోరునైనా ఇంగ్లండ్‌ సులువుగా ఛేదించగలదు. మొయిన్‌ అలీ, ఆదిల్‌ రషీద్‌ తమ స్పిన్‌తో ప్రత్యర్థిని కట్టడి చేయగల సమర్థులు. కానీ, బిగ్‌ మ్యాచ్‌ కావడంతో ఇరు జట్లపై ఒత్తిడి సహజమే.

జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), రాహుల్‌, కోహ్లీ, సూర్యకుమార్‌, పాండ్యా, పంత్‌/దినేష్‌ కార్తీక్‌ (వికెట్‌ కీపర్‌), అక్షర్‌, అశ్విన్‌, భువనేశ్వర్‌, షమి, అర్ష్‌దీప్‌ సింగ్‌.

ఇంగ్లండ్‌: బట్లర్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), హేల్స్‌, మలన్‌/ఫిల్‌ సాల్ట్‌, స్టోక్స్‌, హ్యారీ బ్రూక్స్‌, లివింగ్‌స్టోన్‌, మొయిన్‌ అలీ, కర్రాన్‌, క్రిస్‌ వోక్స్‌, జోర్డాన్‌, ఆదిల్‌ రషీద్‌.

పిచ్‌/వాతావరణం

ఈ పిచ్‌పై న్యూజిలాండ్‌-ఐర్లాండ్‌, ఆస్ర్టేలియా-అఫ్ఘాన్‌ మధ్య మ్యాచ్‌లు జరిగాయి. తొలుత కివీస్‌ 185 పరుగులు సాధించగా, ఛేదనలో ఐర్లాండ్‌ 150/9 రన్స్‌ చేసింది. ఇక ఆస్ట్రేలియా నిర్దేశించిన 169 పరుగుల ఛేదనలో అఫ్ఘాన్‌ 164 రన్స్‌ చేసింది. ఇదే వేదికపై బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 184 పరుగుల స్కోరు చేసింది. ఇక ఉదయం వర్ష ఛాయలున్నా.. మ్యాచ్‌ సమయానికి వాతావరణం సాధారణంగా ఉండనుంది. ఈ వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌ అడిలైడ్‌లో ఆడడం ఇదే తొలిసారి. ఇక్కడ జరిగిన 6 సూపర్‌-12 మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లు 4 సార్లు నెగ్గాయి.

Updated Date - 2022-11-10T06:29:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising