FIFA World Cup: మొరాకోను ఓడించి ఫైనల్‌కు ఫ్రాన్స్.. ఆదివారం అర్జెంటైనాతో ఢీ

ABN, First Publish Date - 2022-12-15T10:35:50+05:30

సంచలన రీతిలో తొలిసారి వరల్డ్‌కప్‌ సెమీస్‌ చేరి చరిత్ర సృష్టించిన అండర్‌ డాగ్‌ మొరాకోకు టైటిల్‌ ఫేవరెట్‌గా పరిగణిస్తున్న ఫ్రాన్స్‌ షాకిచ్చింది. మొరాకోను 2-0తో ఓడించి ఫ్రాన్స్ ఫైనల్‌కు..

FIFA World Cup: మొరాకోను ఓడించి ఫైనల్‌కు ఫ్రాన్స్.. ఆదివారం అర్జెంటైనాతో ఢీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంచలన రీతిలో తొలిసారి వరల్డ్‌కప్‌ సెమీస్‌ (FIFA World Cup 2022) చేరి చరిత్ర సృష్టించిన అండర్‌ డాగ్‌ మొరాకోకు (Morocco) టైటిల్‌ ఫేవరెట్‌గా పరిగణిస్తున్న ఫ్రాన్స్‌ (France) షాకిచ్చింది. మొరాకోను 2-0తో ఓడించి ఫ్రాన్స్ ఫైనల్‌కు చేరింది. గోల్స్ చేయడంలో మొరాకో పూర్తిగా విఫలమైంది. మ్యాచ్ ముగిసేవరకూ గోల్ చేసేందుకు తీవ్రంగా శ్రమించిన మొరాకో సెమీస్‌లో ఖాతా తెరవకుండానే వెనుదిరగడం గమనార్హం. హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఫ్రాన్స్ మొరాకోను ఓడించడంతో ఆదివారం జరగనున్న ఫైనల్‌లో అర్జెంటీనాతో (France vs Argentina) తలపడనుంది. యూరోపియన్‌ ఫుట్‌బాల్‌ పవర్‌హౌస్‌లకు షాకిస్తూ జెయింట్‌ కిల్లర్‌గా నిలిచిన మొరాకో ఆ జట్టు అభిమానులను సెమీస్‌లో తీవ్రంగా నిరాశపరిచింది. ఈ మ్యాచ్‌లో హ్యూగో లోరిస్‌ సేన ఫేవరెట్‌ అయినా.. టోర్నీలో మొరాకో ఆటను చూసిన తర్వాత ఆ జట్టును ఏమాత్రం తేలిగ్గా తీసుకొనే అవకాశం లేదని అంతా భావించారు.

లీగ్‌ దశలో వరల్డ్‌ నెం:2 బెల్జియానికి షాకిచ్చిన అట్లాస్‌ లయన్స్‌.. రౌండ్‌-16లో మాజీ చాంపియన్‌ స్పెయిన్‌ను షూటౌట్‌ చేసింది. ఇక క్వార్టర్స్‌లో బలమైన పోర్చుగల్‌ను ఓడించి తొలిసారి సెమీస్‌కు చేరుకొంది. ఇదే జోరుతో ఫైనల్‌ చేరాలన్న పట్టుదలతో ప్రయత్నించినా మొరాకోకు పరాభవం తప్పలేదు. సమష్టిగా ప్రత్యర్థి గోల్‌ పోస్టులపై దాడులు చేయడం మొరాకో ప్రత్యేకత. హాకీమి జియేష్‌, సోఫియానే బౌఫాల్‌, యూసుఫ్‌ నేసిరో ఫార్వర్డ్‌ విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు. జట్టులో స్టార్‌ ఆటగాడు అచారఫ్‌ హకీమి ఉండనే ఉన్నాడు. అయినప్పటికీ ఫ్రాన్స్ మొరాకోకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.

వరుసగా రెండోసారి సెమీస్‌ చేరిన ఫ్రెంచ్‌ టీమ్‌.. చివరి లీగ్‌ మ్యాచ్‌లో ట్యునీసియా చేతిలో ఓడినా.. సునాయాసంగా నాకౌట్‌ బెర్త్‌ను పట్టేసింది. ఇక, ప్రీక్వార్టర్స్‌లో పోలెండ్‌ను చిత్తు చేసిన ఫ్రాన్స్‌.. క్వార్టర్స్‌లో బలమైన ఇంగ్లండ్‌ను ఓడించి ఆత్మవిశ్వాసం కనబర్చింది. స్ట్రయికర్లు ఎంబప్పే, గిరోర్డ్‌ మంచి ఫామ్‌లో ఉండడం జట్టుకు శుభపరిణామం కాగా.. అనుభవజ్ఞుడైన గ్రీజ్‌మెన్‌ చక్కని అవకాశాలు సృష్టిస్తున్నాడు. మొత్తంగా చూస్తే అర్జంటీనాతో ఫైనల్‌లో రసవత్తర పోరు జరిగే అవకాశం ఉంది. విశ్వకప్‌ సెమీస్‌లో ఆడడం ఫ్రాన్స్‌కు ఇది ఏడోసారి. గతంలో 1958, 1982, 1986ల్లో జరిగిన టోర్నీల్లో సెమీస్‌లో ఫ్రెంచ్‌ టీమ్‌ వెనుదిరగ్గా.. 1998, 2006, 2018ల్లో ఫైనల్‌ చేరింది. ఇప్పుడు నాలుగో సారి ఫైనల్‌కు చేరి రికార్డు సృష్టించింది.

Updated Date - 2022-12-15T10:39:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising