Lionel Messi: ఫిఫా ప్రపంచ కప్‌లో చరిత్ర సృష్టించిన లియోనల్ మెస్సీ
ABN, First Publish Date - 2022-11-22T19:11:30+05:30
అర్జెంటినా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ (Lionel Messi) చరిత్ర సృష్టించాడు. నాలుగు ఫిపా ప్రపంచకప్ టోర్నీలలో స్కోర్
ఖతర్: అర్జెంటినా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ (Lionel Messi) చరిత్ర సృష్టించాడు. నాలుగు ఫిపా ప్రపంచకప్ టోర్నీలలో స్కోర్ చేసిన తొలి అర్జెంటినీ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఖతర్‌లోని లుసైల్ స్టేడియం (Lusail Stadium)లో సౌదీ అరేబియాతో జరిగిన మ్యాచ్‌లో మెస్సీ ఈ ఘనత సాధించాడు. నాలుగు ప్రపంచకప్‌లు (2006, 2014, 2018, 2022)లలో స్కోర్ చేసిన ఐదో ఆటగాడిగానూ 35 ఏళ్ల మెస్సీ చరిత్ర సృష్టించాడు. అతడి కంటే ముందు బ్రెజిల్ దిగ్గజం పీలే, జర్మనీ ఆటగాళ్లు ఉవే సీలర్, మిరోస్లావ్ క్లోసే, పోర్చుగల్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో ఉన్నారు.
ఈ మ్యాచ్ ప్రారంభ నిమిషాల్లో అర్జెంటినాకు పెనాల్టీ లభించింది దీనిని మెస్సీ చక్కగా ఉపయోగించుకున్నాడు. సౌదీ అరేబియా గోల్‌కీపర్ పొరపాటు కోసం ఎదురుచూస్తున్న మెస్సీ 10వ నిమిషంలో బంతిని ఎదురుగా ఉన్న కార్నర్‌లోకి అద్భుతంగా నెట్టేసి గోల్ కొట్టేశాడు. ఈ ప్రపంచకప్‌లో అర్జెంటినాకు ఇదే తొలి గోల్. ఈ గోల్‌తో మెస్సీ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. నాలుగు ఫిఫా ప్రపంచకప్‌లలో స్కోర్ చేసిన తొలి అర్జెంటినీ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు.
Updated Date - 2022-11-22T19:11:32+05:30 IST