ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL 2023 Retention Full List: ఏ జట్టు.. ఏ ఆటగాడిని వదులుకుందంటే?.. పూర్తి జాబితా ఇదే!

ABN, First Publish Date - 2022-11-15T20:13:21+05:30

ఐపీఎల్ ట్రేడింగ్ విండో నేటి (మంగళవారం)తో ముగిసింది. దీంతో ఆయా జట్లు రిటైన్ చేసుకున్న, వదులుకున్న ఆటగాళ్ల జాబితాను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఐపీఎల్ ట్రేడింగ్ విండో నేటి (మంగళవారం)తో ముగిసింది. దీంతో ఆయా జట్లు రిటైన్ చేసుకున్న, వదులుకున్న ఆటగాళ్ల జాబితాను ఐపీఎల విడుదల చేసింది. ట్రేడింగ్ విండో గడువు ముగియడానికి సమయం దగ్గరపడుతుండడంతో గత కొన్ని రోజులుగా ఫ్రాంచైజీలన్నీ ఆటగాళ్ల కూర్పుపై తలమునకలయ్యాయి. డిసెంబరులో జరగనున్న మినీ వేలానికి ముందు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను సమర్పించాలని ఐపీఎల్ కోరింది. ప్రతి జట్టుకు వేతనం కోసం కేటాయించిన రూ. 90 కోట్ల శాలరీ క్యాప్‌కు అదనంగా రూ. 5 కోట్లు ఉంటాయి. కాగా, డిసెంబరు 16న కోచిలో వేలం జరిగే అవకాశం ఉంది.

ట్రేడింగ్ విండోను కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) చక్కగా ఉపయోగించుకుంది. ఢిల్లీ కేపిటల్స్ నుంచి శార్దూల్ ఠాకూర్‌ను, డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ నుంచి న్యూజిలాండ్ పేసర్ లాకీ ఫెర్గ్యూసన్‌, ఆఫ్ఘనిస్థాన్ వికెట్ కీపర్ బ్యాటర్ రహ్మతుల్లా గుర్బాజ్‌ను కొనుగోలు చేసింది. అలాగే, అమన్ ఖాన్‌ను ఢిల్లీ కేపిటల్స్‌కు ఇచ్చేసింది.

ముంబై ఇండియన్స్‌ విధ్వంసకర ఆటగాడు కీరన్ పొలార్డ్ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం ఆ జట్టుకు పెద్ద దెబ్బే. 5సార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్‌‌కు పొలార్డ్ 12 ఏళ్లు ప్రాతినిధ్యం వహించాడు. గత సీజన్‌లో ముంబై రూ.6 కోట్లతో పొలార్డ్‌ను రిటైన్ చేసుకుంది. అయితే, ఆ సీజన్‌లో పొలార్డ్ దారుణంగా నిరాశ పరిచాడు. ఇక, ఆసీస్ లెఫ్టార్మ్ పేసర్ జానస్ బెహ్రెండార్ఫ్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నుంచి ముంబై కొనుగోలు చేసింది. అయితే, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలు మాత్రం ట్రేడింగ్ విండోలో మౌనంగా ఉండిపోయాయి.

మరోవైపు, పంజాబ్ ఇండియన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి మయాంక్ అగర్వాల్‌ను తొలగించి శిఖర్ ధావన్‌కు బాధ్యతలు అప్పగించింది. అంబటి రాయుడు, రవీంద్ర జడేజాలను చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకుంది. వెటరన్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావోను చెన్నై సూపర్ కింగ్స్ రిలీజ్ చేయగా, కేన్ విలియమ్సన్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ రిలీజ్ చేసింది.

చెన్నై సూపర్ కింగ్స్: డ్వాన్ బ్రావో, రాబిన్ ఉతప్ప (రిటైర్డ్), క్రిస్ జోర్డాన్, ఆడం మిల్నే, ఎన్.జగదీశన్, సి.హరి నిశాంత్, కె.భగత్ వర్మ, కేఎం అసిఫ్‌లను రిలీజ్ చేసింది. మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్/వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, డెవోన్ కాన్వే, మోయీన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, అంబటి రాయుడు, డ్వైన్ ప్రిటోరియస్, మహీశ్ తీక్షణ, ప్రశాంత్ సోలంకి, దీపక్ చాహర్, ముకేశ్ చౌదరీ, సిమ్రజీత్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, రాజ్‌వర్ధన్ హంగార్గేకర్, మిచెల్ శాంట్నర్, మథీశ పథిరన, సుబ్రాంశు సేనాపతిలను రిటైన్ చేసుకుంది.

లక్నో సూపర్ జెయింట్: జాసన్ హోల్డర్, ఎవిన్ లూయిస్, షాబాద్ నదీమ్, మనీష్ పాండే, ఆండ్రూ టై, అంకిత్ రాజ్‌పుత్, దుష్మంత చమీరలను వదిలించుకుంది. కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, మనన్ వోహ్రా, ఆయుష్ బడోని, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్, కైల్ మేయర్స్, కరణ్ శర్మ, కె.గౌతమ్, అవేష్ ఖాన్, మొహసిన్ ఖాన్, రవి బిష్ణోయ్, మార్క్‌వుడ్, మయాంక్ యాదవ్‌లను రిటైన్ చేసుకుంది.

సన్ రైజర్స్ హైదరాబాద్: కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, రొమారియో షెపర్డ్, జె. సుచిత్, శ్రేయాస్ గోపాల్‌లను రిలీజ్ చేసింది. రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్కరమ్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్, కార్తీక్ త్యాగి, ఫజల్హాక్ ఫరూఖీలను రిటైన్ చేసుకుంది.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, అనీశ్వర్ గౌతమ్, చామ మిలింద్, లువ్నిత్ సిసోడియాలను వదిలించుకుంది. ఫా డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్, మహిపాల్ లోమ్రోర్, ఫిన్ అలెన్, రజత్ పటీదార్, అనూజ్ రావత్, గ్లెన్ మాక్స్‌వెల్, డేవిడ్ విల్లీ, వనిందు హసరంగా, షాబాజ్ అహ్మద్, సుయాష్ ప్రభుదేసాయి, హర్షల్ పటేల్, సిద్ధార్థ్ సిరాజ్ కౌల్, జోషామ్ కౌల్, హేజిల్‌వుడ్, కర్ణ్ శర్మలను రిటైన్ చేసుకుంది.

ముంబై ఇండియన్స్: కీరన్ పొలార్డ్, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఆర్యన్ జుయల్, బాసిల్ థంపి, డేనియల్ శామ్స్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రాహుల్ బుద్ధి, రిలే మెరెడిత్, సంజయ్ యాదవ్, టైమల్ మిల్స్‌లను రిలీజ్ చేసింది. రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, డెవాల్డ్ బ్రీవిస్, తిలక్ వర్మ, ట్రిస్టన్ స్టబ్స్, రమణదీప్ సింగ్, టిమ్ డేవిడ్, జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్, హృతిక్ షోకీన్, కుమార్ కార్తికేయ, జాసన్ బెహ్రెండోర్ఫ్, అర్జున్ టెండూల్కర్, అర్షద్ ఖాన్, ఆకాష్ మధ్వల్‌లను రిటైన్ చేసుకుంది.

పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్, వైభవ్ అరోరా, బెన్నీ హోవెల్, ఇషాన్ పోరెల్, అన్ష్ పటేల్, ప్రేరక్ మన్కడ్, సందీప్ శర్మ, రిటిక్ ఛటర్జీలను విడుదల చేసింది. శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, భానుకా రాజపక్సే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, షారుక్ ఖాన్, లియామ్ లివింగ్‌స్టోన్, హర్‌ప్రీత్ బ్రాడ్, రాజ్ బావా, రిషి ధావన్, అథర్వ తాజ్డే, కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్, రాహుల్ చాహర్, నాథన్ ఎల్లిస్, బాల్టేజ్ సింగ్‌లను రిటైన్ చేసుకుంది.

Updated Date - 2022-11-15T20:15:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising