Stephen Fleming: ఆ కిటుకును పసిగట్టలేక..: ఫ్లెమింగ్
ABN, First Publish Date - 2022-11-14T03:45:52+05:30
డెత్ ఓవర్లలో బ్యాటర్లు బోల్తా పడడం.. పాక్ ఓటమికి కారణ మని న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ విశ్లేషించాడు. ‘16 ఓవర్లలో 119/4తో ఉన్న పాక్.. చివరి 4 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే చేసింది.
మెల్‌బోర్న్: డెత్ ఓవర్లలో బ్యాటర్లు బోల్తా పడడం.. పాక్ ఓటమికి కారణ మని న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ విశ్లేషించాడు. ‘16 ఓవర్లలో 119/4తో ఉన్న పాక్.. చివరి 4 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే చేసింది. వాస్తవంగా అయితే అక్కడినుంచి ఓవర్ కు 10 పరుగులు రాబట్టినా స్కోరు దాదాపుగా 160-165 పరుగులకు చేరుకొనేది. ఈ పిచ్‌పై ఇది నిజంగా సవాల్ విసిరే స్కోరు. కానీ, ఎంసీజీ గ్రౌండ్ బౌండరీలను పాక్ బ్యాటర్లు సరిగా అర్థం చేసుకోలేద’ని ఫ్లెమింగ్ చెప్పాడు. ఈ కిటుకును పసిగట్టకపోవడం వల్లే డెత్‌లో వారు తడబడ్డారని తెలిపాడు. ఇంగ్లండ్ బౌలర్లు కూడా తెలివిగా బౌండ్రీ 85 మీటర్ల దూరం ఉన్న వైపే షాట్లు ఆడే విధంగా బంతులు విసిరి.. పాక్ బ్యాటర్లను ఉచ్చులోకి లాగారన్నాడు. కొంచెం బుర్ర ఉపయోగించి సింగిల్స్, డబుల్స్‌తో నెట్టుకొచ్చినా పరిస్థితి మరో రకంగా ఉండేదని స్టీఫెన్ అభిప్రాయపడ్డాడు.
Updated Date - 2022-11-14T03:45:53+05:30 IST