Sundar Pichai: పాక్ అభిమానికి సుందర్ పిచాయ్ దిమ్మతిరిగే రిప్లై..
ABN, First Publish Date - 2022-10-24T15:32:28+05:30
నరాలు తెగే ఉత్కంఠను మించి జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండియా విజయం సాధించడంతో భారతీయ క్రికెట్ ఫ్యాన్స్ సంబురాల్లో మునిగిపోయారు. ఒక రోజు ముందుగానే దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈ చిరస్మరణీయ గెలుపును ఆస్వాదించారు. భారత సంతతి వ్యక్తి, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు.
టీ20 వరల్డ్ కప్2022 (T20 world cup2022)లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (india Vs pakistan) మధ్య ఆదివారం ముగిసిన మ్యాచ్ భారత్, పాక్ క్రికెట్ ఫ్యాన్స్‌ను మాత్రమే కాకుండా యావత్ క్రికెట్ ప్రపంచాన్ని అలరించింది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (Melbourne Cricket Ground) ప్రత్యక్షంగా 90 వేల మంది వీక్షించగా.. కొట్లాది మంది టీవీల్లో చూసి ఎంజాయ్ చేశారు. నరాలు తెగే ఉత్కంఠను మించి జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండియా విజయం సాధించడంతో భారతీయ క్రికెట్ ఫ్యాన్స్ సంబురాల్లో మునిగిపోయారు. ఒక రోజు ముందుగానే దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈ చిరస్మరణీయ గెలుపును ఆస్వాదించారు. భారత సంతతి వ్యక్తి, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. టీవీలో మ్యాచ్ చూసి ఎంజాయ్ చేసిన ఆయన దీపావళి రోజు (సోమవారం) ట్విటర్ వేదికగా వెల్లడించారు. మ్యాచ్ చివరి మూడు ఓవర్లను ఈ రోజు మళ్లీ చూసి దీపావళి సెలబ్రెట్ చేసుకున్నానని చెప్పారు. అసలు అదిరిపోయే మ్యాచ్, ప్రదర్శన అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబసభ్యులు, స్నేహితులతో ఉమ్మడిగా దీపావళి సంబరాలు చేసుకుంటారని భావిస్తున్నానని ట్వీట్‌లో పేర్కొన్నారు.
పాక్ అభిమానికి అదిరిపోయే రిప్లై..
సుందర్ పిచాయ్ ట్వీట్‌పై పాక్ క్రికెట్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. ఓ పాక్ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘ మీరు(సుందర్ పిచాయ్) మొదటి మూడు ఓవర్లు చూడాల్సింది’’ అంటూ ఆరంభంలో టీమిండియా వికెట్లు కోల్పోయిన సందర్భాన్ని ప్రస్తావించాడు. ఈ ట్వీట్‌కు సుందర్ పిచాయ్ అదిరిపోయే గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘అది కూడా చూశా.. భువీ, అర్ష్‌దీప్ నుంచి అద్భుతమైన బౌలింగ్ స్పెల్’ అంటూ రిప్లై ఇచ్చి నెటిజన్ నోరు మూయించారు. తాను టీమిండియా ఇన్నింగ్స్ గురించి చెబుతున్నానంటూ నెటిజన్ రిప్లై ఇచ్చాడు. అయినప్పటికీ నెటిజన్లు సుందర్ పిచాయ్‌కి మద్ధతుగా నిలిచారు.
Updated Date - 2022-10-24T15:39:44+05:30 IST