T20 World Cup: జింబాబ్వేకు షాక్.. తొలి బంతికే వికెట్ డౌన్
ABN, First Publish Date - 2022-11-06T15:32:35+05:30
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్ (Team India)తో జరుగుతున్న చివరి మ్యాచ్‌లో జింబాబ్వే (Zimbabwe)కు తొలి ఓవర్
మెల్బోర్న్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్ (Team India)తో జరుగుతున్న చివరి మ్యాచ్‌లో జింబాబ్వే (Zimbabwe)కు తొలి ఓవర్ తొలి బంతికే షాక్ తగిలింది. భారత్ నిర్దేశించిన 187 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వేకు టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ షాకిచ్చాడు. వేసిన తొలి బంతికే ఓపెనర్ వెస్లీ మధెవెర్ అవుటయ్యాడు. వెస్లీ ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లీ ఒడుపుగా అందుకున్నాడు. దీంతో ఒక ఓవర్ ముగిసే సరికి జింబాబ్వే పరుగులేమీ చేయకుండానే ఒక వికెట్ కోల్పోయింది.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రాహుల్ (51), సూర్యకుమార్ యాదవ్ (61) అర్ధ సెంచరీలతో అదరగొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.
Updated Date - 2022-11-06T15:34:51+05:30 IST