ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Team India: ఆస్ట్రేలియాతో మహిళల టీ20 సిరీస్.. టీమిండియాకు ఎంపికైన ఏపీ అమ్మాయి

ABN, First Publish Date - 2022-12-02T21:09:34+05:30

స్వదేశంలో ఆస్ట్రేలియా(Australia)తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత మహిళల (Team India women)

Anjali Sarvani
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: స్వదేశంలో ఆస్ట్రేలియా(Australia)తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత మహిళల (Team India women) జట్టుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేశవరాజుగారి అంజలి శర్వాణి (25) ఎంపికైంది. గాయం కారణంగా పూజా వస్త్రాకర్ జట్టుకు దూరం కావడంతో లెఫ్టార్మ్ పేసర్ అయిన అంజలి (Anjali Sarvani)కి సెలక్టర్ల నుంచి పిలుపు అందింది. అలాగే, మహారాష్ట్ర లెఫ్ట్ హ్యాండ్ ఆల్‌రౌండర్ దేవిక వైద్య నాలుగేళ్ల తర్వాత తిరిగి జట్టులో చోటు దక్కించుకుంది. ఆల్‌రౌండర్ స్నేహ్ రాణాను పక్కన పెట్టగా హర్లీన్ డియోల్, యస్తికా భాటియా తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నారు. అలాగే, మోనికా పటేల్, అరుంధతి రెడ్డి, ఎస్‌బీ పోఖార్కర్, సిమ్రన్ బహదూర్‌లు నెట్‌ బౌలర్లుగా జట్టులో చేరనున్నారు.

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన అంజలి తండ్రి ఉపాధ్యాయుడు కాగా, తల్లి గృహిణి. పట్టణంలోని మిల్టన్ హైస్కూల్‌లో టెన్త్ క్లాస్ వరకు చదివింది. క్రికెట్‌పై చిన్నప్పటి నుంచే ఆసక్తి పెంచుకున్న కుమార్తెను తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ఈ క్రమంలో మంచి ప్రతిభ కనబరించిన అంజలి జిల్లా స్థాయికి, అక్కడి నుంచి రాష్ట్రస్థాయికి ఎదిగింది. ఇప్పుడు భారత జట్టుకు ఎంపికై తన కలను నెరవేర్చుకుంది.

భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, యస్తికా భాటియా (వికెట్ కీపర్), జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా సింగ్ ఠాకూర్, మేఘన సింగ్, అంజలి శ్రావణి, దేవిక వైద్య, ఎస్.మేఘన, రిచా ఘోష్ (వికెట్ కీపర్), హర్లీన్ డియోల్.

మ్యాచ్‌లు ఇలా..

ఈ నెల 9న నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో తొలి టీ20 జరగనుండగా, 11న అదే స్టేడియంలో రెండో టీ20 జరుగుతుంది. మూడో మ్యాచ్ 14న ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరుగుతుంది. డిసెంబరు 17, 20న జరిగే నాలుగైదు టీ20లు కూడా అదే వేదికలో జరుగుతాయి.

Updated Date - 2022-12-02T21:15:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising