ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

USA Cricket: అక్కడా మనోళ్ల డామినేషనే.. అమెరికా అండర్-19 జట్టులో తెలుగమ్మాయిల హవా..

ABN, First Publish Date - 2022-12-15T12:01:13+05:30

దక్షిణాఫ్రికా (South Africa) వేదికగా వచ్చే నెలలో మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్ (USA CRICKET WOMEN’S UNDER 19S SQUAD) మొదలవనుంది. ఈ క్రమంలో.. అమెరికా క్రికెట్ బోర్డ్ 15 మంది స్క్వాడ్‌తో కూడిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దక్షిణాఫ్రికా (South Africa) వేదికగా వచ్చే నెలలో మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్ (USA CRICKET WOMEN’S UNDER 19S SQUAD) మొదలవనుంది. ఈ క్రమంలో.. అమెరికా క్రికెట్ బోర్డ్ 15 మంది స్క్వాడ్‌తో కూడిన అండర్-19 జట్టును (USA Cricket) తాజాగా ప్రకటించింది. అమెరికా అండర్-19 మహిళల జట్టుకు తెలుగు మూలాలున్న అమ్మాయిలే ఎక్కువగా ఎంపిక కావడం విశేషం. గీతికా కొడాలి అనే తెలుగు సంతతికి చెందిన అమ్మాయి అమెరికా అండర్-19 మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనుంది. అంతేకాదు.. అమెరికా క్రికెట్ బోర్డ్ జట్టులో ఎంపిక చేసిన భూమిక భద్రిరాజు, లాస్య ముళ్లపూడి, సాయి తన్మయి ఇయ్యుని, కస్తూరి వేదాంతం (Reserve).. వీళ్లంతా తెలుగు సంతతికి చెందిన అమ్మాయిలే కావడం విశేషం.

అమెరికా అండర్-19 మహిళల క్రికెట్ జట్టుకు ఒక తెలుగు సంతతి అమ్మాయికి కెప్టెన్సీ చేసే అవకాశం రావడం పట్ల అమెరికాలోని తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. రంగం ఏదైనా తమ ప్రతిభతో తెలుగు వాళ్లు సత్తా చాటుతున్నారని.. ఇంత మంది తెలుగు సంతతి అమ్మాయిలు అమెరికా క్రికెట్ టీంలో భాగం కావడం తెలుగు జాతికే గర్వ కారణం అని అక్కడి తెలుగు సమాజం హర్షం వ్యక్తం చేసింది. తొలిసారి జరుగుతున్న అండర్-19 ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్‌లో భాగమవుతున్న అమెరికా అండర్-19 మహిళా క్రికెట్ జట్టులో భాగమయ్యే అవకాశం మన తెలుగు అమ్మాయిలకు దక్కడం మరో విశేషం.

దక్షిణాఫ్రికా వేదికగా 2023, జనవరి 14 నుంచి 29 వరకూ తొలి అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఉమెన్ క్రికెట్‌ను మరింత ప్రోత్సహించే విధంగా మెగా టోర్నమెంట్ నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. 2021లోనే ఈ అండర్-19 మహిళల క్రికెట్ వరల్డ్ కప్ జరగాల్సి ఉంది. అయితే.. కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లు ఆలస్యంగా టోర్నీ మొదలుకానుంది. దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నీలో టీమిండియాతో సహా మొత్తం 16 జట్లు భాగం కానున్నాయి. నాలుగు జట్లను ఒక్కో గ్రూప్‌గా విభజించారు. టీమిండియా గ్రూప్-డిలో ఉంది. టీమిండియా అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్‌కు టీమిండియా యంగ్ బ్యాటర్ షఫాలీ వర్మ కెప్టెన్సీ వహించనుంది. షఫాలీ వర్మ టీమిండియా మహిళా క్రికెట్ జట్టులో ఇప్పటికే ఆడుతున్నప్పటికీ ఆమెకు 19 ఏళ్లు నిండకపోవడంతో అండర్-19కు నాయకత్వం వహించే అవకాశం దక్కడం గమనార్హం. ఇదిలా ఉండగా.. USA Cricket Womens Under-19 పూర్తి స్క్వాడ్‌ను ఇక్కడ చూద్దాం.

Team USA Women’s U19 Squad

గీతికా కొడాలి (కెప్టెన్)

అనిక కోలన్ (వికెట్ కీపర్) (వైస్ కెప్టెన్)

అదితి

భూమిక భద్రిరాజు

దిషా

ఇసాని వాఘేలా

జివానా అరాస్

లాస్య ముళ్లపూడి

పూజా గణేష్ (WK)

పూజా షా

రీతూ సింగ్

సాయి తన్మయి

స్నిగ్దా పాల్

సుహాని

తారానం చోప్రా

Reserves

చేతన ప్రసాద్

కస్తూరి వేదాంతం

లీసా రంజిత్

మిథాలీ పట్వర్ధన్

థ్యా గొంజెల్వ్స్

Head Coach: Shivnarine Chanderpaul

Team Manager: John Aaron

Team Analyst: Rohaan Gosala

S&C/Assistant Coach: Burt Cockley

Physio/Medical: Dr. Audrey Adams

Assistant Team Manager: Joan Alexander-Serrano

Selection Panel: Ritesh Kadu (Interim Chair), Jyotsna Patel, Deepali Rokade

Updated Date - 2022-12-15T12:06:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising