ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Virat Kohli: మరో అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ

ABN, First Publish Date - 2022-10-30T21:36:40+05:30

టీమిండియా పరుగుల వీరుడు, మాజీ సారథి విరాట్ కోహ్లీ(Virat Kohli) మరో అరుదైన రికార్డును తన పేర రాసుకున్నాడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెర్త్: టీమిండియా పరుగుల వీరుడు, మాజీ సారథి విరాట్ కోహ్లీ(Virat Kohli) మరో అరుదైన రికార్డును తన పేర రాసుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup)లో 1000 పరుగులు సాధించిన రెండో క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగులు మాత్రమే చేసిన కోహ్లీ ఈ ఘనత అందుకున్నాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్ సందర్భంగా క్రిస్ గేల్ రికార్డును బద్దలుగొట్టిన 33 ఏళ్ల కోహ్లీ.. శ్రీలంక లెజెండ్ మహేల జయవర్థనె అత్యధిక పరుగుల రికార్డుకు 28 పరుగుల దూరంలో నిలిచాడు. జయవర్ధనె 31 మ్యాచుల్లో 1016 పరుగులు చేశాడు. కోహ్లీ 24వ మ్యాచ్ (22వ ఇన్నింగ్స్)లోనే 1000 పరుగుల మైలు రాయిని చేరుకోవడం విశేషం.

అయితే, ఈ మ్యాచ్‌లో 12 పరుగులు మాత్రమే చేసిన కోహ్లీ టీ20 ప్రపంచకప్‌లో రెండో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. కాగా, టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక అర్ధ సెంచరీలు సాధించిన రికార్డు ఇప్పటికే కోహ్లీ పేరున ఉంది. అలాగే, అంతర్జాతీయ టీ20ల్లోనూ అత్యధిక పరుగులు సాధించిన రికార్డు కూడా కోహ్లీ సొంతం. అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లీ 3,868 పరుగులు సాధించాడు. ఆ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ అన్నాడు. దీంతోపాటు టీ20 ప్రపంచకప్‌లో 12, అంతర్జాతీయ టీ20ల్లో 36 అర్ధ సెంచరీలు సాధించాడు.

Updated Date - 2022-10-30T21:41:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising