ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Virat Kohli: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌ అవార్డుకు కోహ్లీ నామినేట్

ABN, First Publish Date - 2022-11-03T16:23:05+05:30

ఈ అవార్డును ప్రవేశపెట్టిన తర్వాత కోహ్లీ (virat kohli) నామినేట్ కావడం ఇదే తొలిసారి. విరాట్‌తోపాటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెర్త్: టీమిండియా (team india) మాజీ సారథి విరాట్ కోహ్లీ ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఈ అవార్డును ప్రవేశపెట్టిన తర్వాత కోహ్లీ (virat kohli) నామినేట్ కావడం ఇదే తొలిసారి. విరాట్‌తోపాటు సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్( David Miller), జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా (Sikandar Raza) కూడా ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు. ఇక, మహిళల కేటగిరీలో టీమిండియా అమ్మాయిలు జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ నామినేట్ కాగా, పాకిస్థాన్ మహిళా జట్టు నుంచి నిదాదార్ నామినేట్ అయింది. టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ బ్యాట్‌తో దుమ్మరేపు తున్నాడు. ఆసియా కప్‌లో రెండు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీతో చెలరేగిన కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లోనూ పరుగుల వరద పారిస్తున్నాడు.

కోహ్లీ వర్సెస్ మిల్లర్ వర్సెస్ రజా

ప్రపంచకప్ ప్రారంభమైన అక్టోబరు నెలలో కోహ్లీ రెండు అర్ధ సెంచరీలతో 205 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 82 పరుగులు చేసి తానేంటో మరోమారు క్రికెట్ ప్రపంచానికి చాటిచెప్పాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 62 పరుగులు చేశాడు. మరోవైపు, పెర్త్‌తో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ఆటతీరుతో జట్టును విజయతీరాలకు చేర్చిన డేవిడ్ మిల్లర్.. ఈ అవార్డు కోసం కోహ్లీతో పోటీపడుతున్నాడు. భారత్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌తో ఈ నెలను ప్రారంభించిన మిల్లర్ మూడు వన్డేల్లో 117 పరుగులు చేశాడు. రెండు టీ20ల్లో 125 పరుగులు చేశాడు. ఇందులో గువాహటిలో 79 బంతుల్లో 106 (నాటౌట్) పరుగులు చేశాడు.

ఇక జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా కూడా ప్లేయర్ ఆఫ్ ద మంత్‌కు నామినేట్ అయ్యాడు. సూపర్-12 రౌండ్-1లో పాకిస్థాన్‌ను మట్టికరిపించడంలో రజా కీలక పాత్ర పోషించాడు. కాగా, ఆగస్టులోనూ ఈ అవార్డు రజాకే దక్కడం గమనార్హం. రజా ఆరు టీ20ల్లో 145 పరుగులు చేయడంతోపాటు 9 వికెట్లు నేలకూల్చాడు. రజా మూడుసార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. ఐర్లాండ్‌పై 82 (నాటౌట్) పరుగులు చేయగా, పాకిస్థాన్‌పై 25 పరుగులిచ్చి మూడు వికెట్లు నేలకూల్చాడు.

Updated Date - 2022-11-03T16:24:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising