రమీజ్ రజాపై వేటు?
ABN, First Publish Date - 2022-12-22T03:04:28+05:30
సొంతగడ్డపై ఇంగ్లండ్ చేతిలో 0-3తో టెస్ట్ సిరీ్‌సను కోల్పోవడంతో పాక్ క్రికెట్ జట్టులో ప్రక్షాళన మొదలైనట్టు తెలుస్తోంది. ప్రధానంగా పెద్ద పోస్టులోనున్న పాక్ క్రికెట్ బోర్డు (
పీసీబీ చైర్మన్‌గా నజమ్ సేథి!
కరాచీ: సొంతగడ్డపై ఇంగ్లండ్ చేతిలో 0-3తో టెస్ట్ సిరీ్‌సను కోల్పోవడంతో పాక్ క్రికెట్ జట్టులో ప్రక్షాళన మొదలైనట్టు తెలుస్తోంది. ప్రధానంగా పెద్ద పోస్టులోనున్న పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ రమీజ్ రజాపై వేటు పడిందని సమాచారం. రమీజ్ స్థానంలో పీసీబీ చైర్మన్‌గా 74 ఏళ్ల నజమ్ సేథిని ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నియమించినట్లు పాక్ మీడియా పేర్కొంది. మాజీ క్రికెటరైన 60 ఏళ్ల రమీజ్‌ను పీసీబీ చైర్మన్‌గా 2021 సెప్టెంబరులో అప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎంపిక చేశారు. ఇక, పీసీబీ చైర్మన్‌గా నియమితులవడం నజమ్ సేథికి ఇది రెండోసారి. అంతకుముందు 2017 ఆగస్టులో పీసీబీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన సేథి.. 2018లో ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా రావడంతో ఆయనతో విభేదాల కారణంగా పదవి నుంచి తప్పుకొన్నాడు.
వరల్డ్‌కప్ బాయ్‌కాట్‌పై నిర్ణయం తీసుకోలేదు:
వచ్చే ఏడాది సెప్టెంబరులో పాకిస్థాన్‌లో జరిగే 50 ఓవర్ల ఆసియా కప్ కోసం టీమిండియాను పాక్ పంపేది లేదని ఈ అక్టోబరులో బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ మండలి (ఏసీఏ) అధ్యక్షుడు జై షా వ్యాఖ్యానించడం గుర్తుందిగా! టీమిండియా అలా చేస్తే అక్టోబరులో భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచక్‌పను బాయ్‌కాట్ చేస్తామని ఆ మధ్య పీసీబీ పేర్కొంది. అయితే, వరల్డ్‌కప్ బాయ్‌కాట్‌పై తాము నిర్ణయం తీసుకోలేదని తాజాగా ఐసీసీతో రమీజ్ రజా చెప్పినట్టు అంతర్జాతీయ బోర్డు ప్రతినిఽధి వెల్లడించారు.
Updated Date - 2022-12-22T03:04:29+05:30 IST