దీన్‌దయాల్ ఉపాధ్యాయ జయంతి
ABN, First Publish Date - 2022-09-26T03:44:12+05:30
పట్టణంలోని బీజేపీ కార్యాల యంలో జిల్లా అధ్యక్షుడు వెర్రబెల్లి రఘునాథ్ ఆధ్వర్యంలో దీన్‌దయాల్ ఉపాధ్యాయ జయంతిని ఆదివారం నిర్వహిం చారు. ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పిం చారు. రఘునాథ్ మాట్లాడుతూ గ్రామం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపిన వ్యక్తి దీన్‌దయాళ్ అని కొనియాడారు.
ఏసీసీ, సెప్టెంబరు 25: పట్టణంలోని బీజేపీ కార్యాల యంలో జిల్లా అధ్యక్షుడు వెర్రబెల్లి రఘునాథ్ ఆధ్వర్యంలో దీన్‌దయాల్ ఉపాధ్యాయ జయంతిని ఆదివారం నిర్వహిం చారు. ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పిం చారు. రఘునాథ్ మాట్లాడుతూ గ్రామం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపిన వ్యక్తి దీన్‌దయాళ్ అని కొనియాడారు. ఆయన చరిత్రను ప్రతీ ఒక్కరు చదవా లన్నారు. నాయకులు వెంకటేశ్వర్‌రావు, నగునూరి వెం కటేశ్వర్‌గౌడ్, కర్ణ శ్రీధర్, బొలిశెట్టి తిరుపతి, గాదె శ్రీనివాస్, శ్రీదేవి, బొద్దున మల్లేష్, మల్లిఖార్జున్, పాల్గొన్నారు.
జైపూర్: పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా వేలాలలో బీజేపీ నాయకులు మొక్కలు నాటా రు. ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి డేగ నగేష్‌పటేల్, శిషిందర్‌యాదవ్ పాల్గొన్నారు.
మందమర్రిరూరల్: సండ్రోన్‌పల్లిలో బీజేపీ మండల అధ్య క్షుడు పైడిమల్ల నర్సింగ్ ఆధ్వర్యంలో జనసంఘ్ వ్యవస్ధాప కులు దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మొక్కలు నాటారు.
జన్నారం: మండల కేంద్రంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ మండల అధ్యక్షుడు గోలి చందు, నాయకులు మహేష్, వీరాచారి, సురేష్, గంగమల్లుయాదవ్, చందు, ప్రవీణ్ పాల్గొన్నారు.
Updated Date - 2022-09-26T03:44:12+05:30 IST