ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహారాష్ట్రలోని గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ (భారత రాష్ట్ర సమితి) విస్తరణ

ABN, First Publish Date - 2022-12-23T01:10:26+05:30

జిల్లాకు సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలోని సమీప గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ (భారత రాష్ట్ర సమితి) పార్టీని విస్తరించే దిశగా కార్యాచరణ మొదలైంది.

మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా భోకర్‌ తాలూకా కిని గ్రామంలో బీఆర్‌ఎస్‌ నినాదాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై విస్తృత ప్రచారం

ఇక దశల వారీగా అన్ని సరిహద్దు గ్రామాల్లోకి పార్టీని తీసుకువెళ్లడమే..

కొద్దిరోజుల్లోనే మొదలుకానున్న సభ్యత్వ నమోదు

నిర్మల్‌, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : జిల్లాకు సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలోని సమీప గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ (భారత రాష్ట్ర సమితి) పార్టీని విస్తరించే దిశగా కార్యాచరణ మొదలైంది. సరిహద్దు గ్రామాల్లో పార్టీ విస్తరణ, సభ్యత్వ నమోదు, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రచారం లాంటి బాధ్యతలను సీఎం కేసీఆర్‌ జిల్లాకు చెందిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి భుజస్కంధాలపై పెట్టారు. దీంతో గల వారం రోజుల నుంచి మహారాష్ట్రలోని సరిహద్దు గ్రామాల తన సన్నిహితులు, అలాగే వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు, యువజన సంఘాల సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ముథో ల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి సైతం ఈ దిశగా మంత్రికి అండగా నిలుస్తున్నారు. జిల్లాకు చెందిన చాలా మందికి మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న గ్రామాల ప్రజలతో బంధుత్వాలున్నా యి. అలాగే స్నేహితులు కూడా పెద్దసంఖ్యలో ఉన్నా రు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ పార్టీని విస్తరించేందు కోసం వీరందరి సహకారం తీసు కునే దిశగా మంత్రి ఇంద్ర కరణ్‌రెడ్డి పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం జిల్లాకు సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా భోకర్‌ తాలూకా కిని గ్రామంలో బీఆర్‌ఎస్‌ పార్టీ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డితో పాటు తానూర్‌, కుభీర్‌లతో పాటు తదితర మండలాలకు చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కిని గ్రామం నుంచే కాకుండా చుట్టూ పక్కల గ్రామాలకు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు, యువకులు ఆశించిన మేరకు సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలన్నింటినీ పూర్తిగా వివరించి దేశంలో బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఈ పథకాలన్నింటినీ మరింత ఉత్సాహంతో అమలు చేస్తామంటూ ప్రకటించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ కొద్ది రోజుల్లోనే మహారాష్ట్రలో పర్యటించనున్నారని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి బీఆర్‌ఎస్‌ పార్టీ కట్టుబడి ఉందని ఆయన వెల్లడించారు. ఇలా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తన ప్రసంగంలో మహారాష్ట్ర వాసులను ఆకట్టుకోవడమే కాకుండా బీఆర్‌ఎస్‌ పార్టీ వైపు ఆకర్షితులయ్యే విధంగా చేశారు. మంత్రి ప్రసంగానికి మంచి స్పందన లభించడంతో బీఆర్‌ఎస్‌ నేతల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఇలా దశల వారీగా అన్ని గ్రామాల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి బీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని యోచిస్తున్నారు. మొత్తానికి బీఆర్‌ఎస్‌ క్రమంగా మహారాష్ట్రలోని సరిహద్దు గ్రామాల్లో పాగా వేసే అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

పార్టీ విస్తరణకు మంత్రి వ్యూహం

జిల్లాకు ఆనుకొని ఉన్న మహారాష్ట్రలోని గ్రామాలపై మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దృష్టి సారిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీని సరిహద్దు గ్రామాల్లో విస్తరించి అక్కడ పార్టీని పటి ష్టం చేయాలని భావిస్తున్నారు. దీనికి అనుగుణంగానే సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లు కూడా ఇప్పటికే మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో సమీక్ష జరిపారు. నాందేడ్‌ను కేంద్రంగా చేసుకొని సరిహద్దు గ్రామాల్లో పార్టీ విస్తరణ కార్యకలాపాలతో పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమం ని ర్వహించాలని భావిస్తున్నారు. మంత్రితో పాటు ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి, అలాగే సారంగాపూర్‌ మండలానికి చెందిన పలువురు సీనియర్‌ నాయకులు తమ సమీప గ్రామాల్లోని స్థానికులతో మంతనాలు మొదలుపెట్టారంటున్నారు. అలాగే బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన జిల్లా నేతలకు మహారాష్ట్రలోని గ్రామాల్లో పెద్దసంఖ్యలో బంధువులున్నారు. వీరందరినీ అస్త్రంగా మలుచుకొని పార్టీని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు.

రాజకీయ పార్టీలతో సంప్రదింపులు

కాగా జిల్లా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మహారాష్ట్ర సరిహద్దుల్లోని వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారంటున్నారు. బీజేపీ పార్టీని వ్యతిరేకించే పార్టీలతో పాటు ప్రజాసంఘాలు, యువజన సంఘాలతో కూడా మంత్రి అల్లోల ఇప్పటికే పలుసార్లు చర్చలు జరిపినట్లు సమాచారం. ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషిస్తున్నారంటున్నారు. మహారాష్ట్రకు చెందిన బీజేపీ అసంతృప్తి వాదులతో సైతం బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా అన్ని పార్టీల్లోని అసంతృప్తి వాదుల ను కూడా బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. వీరితో కూడా ఇప్పటికే స్థానిక నేతలు చర్చలు జరుపుతున్నారంటున్నారు. అలాగే ఇక్కడి బీఆర్‌ఎస్‌ పార్టీ నేతల బంధువులతో సైతం మంతనాలు సాగిస్తున్నారంటున్నారు.

ప్రచార అస్త్రంగా సంక్షేమ, అభివృద్ది పథకాలు...

కాగా మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ పార్టీని విస్తరించడమే కాకుండా సభ్యత్వ నమోదును లక్ష్యంగా చేసుకుంటున్న ఆ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ది పథకాలను ప్రచార అస్త్రంగా మలుచుకోవాలని భావిస్తోంది. ఆసరాపెన్షన్‌లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, రైతుబంధు, రైతుబీమాలతో పాటు ఇతర పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఏజెండా రూ పొందుతుందని భరోసా కల్పించనున్నారు. అలాగే రాష్ర్టాలకు ప్రస్తుతం ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎంత మేరకు నష్టం చేకూరుస్తుందోనన్న అంశా న్ని కూడా వివరించాలని భావిస్తున్నారు. దీంతో పాటు ప్రాజెక్టుల నిర్మా ణం, మిషన్‌ భగీరథ, రోడ్ల నిర్మాణాలు, డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు, మిషన్‌ కాకతీయ లాంటి పథకాలపై అక్కడి ప్రజలకు వివరించి వారిని ఆకర్షించుకోవాలని యోచిస్తున్నారు.

Updated Date - 2022-12-23T01:10:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising