ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేగ నియంత్రణేది?

ABN, First Publish Date - 2022-09-19T03:50:45+05:30

కవ్వాల టైగర్‌ జోన్‌ పర్యాటకులను ఆకట్టుకుంటుంది. అటవీ ప్రాంతంలోకి అడుగు పెట్టగానే పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి వాహనదారులను, పర్యాటకులను మైమరపింపజేస్తుంది. కవ్వాల టైగర్‌ జోన్‌లోని జన్నారం డివిజన్‌లో ప్రధాన రహదారులు కడెం, జన్నారం మీదుగా తాళ్లపేట వరకు తాళ్లపేట నుంచి బీర్సాయిపేట వరకు సుమారు 60 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం విస్తరించి ఉంది.

వాహనదారులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కవ్వాల అభయారణ్యంలో నిబంధనలు గాలికి

స్పీడ్‌ లిమిట్‌ పట్టించుకొని వాహనాల యజమానులు

రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వన్య ప్రాణులు

జన్నారం, సెప్టెంబరు 18: కవ్వాల టైగర్‌ జోన్‌ పర్యాటకులను ఆకట్టుకుంటుంది. అటవీ ప్రాంతంలోకి అడుగు పెట్టగానే పచ్చని చెట్లు,  స్వచ్ఛమైన గాలి వాహనదారులను, పర్యాటకులను మైమరపింపజేస్తుంది. కవ్వాల టైగర్‌ జోన్‌లోని జన్నారం డివిజన్‌లో ప్రధాన రహదారులు కడెం, జన్నారం మీదుగా తాళ్లపేట వరకు తాళ్లపేట నుంచి బీర్సాయిపేట వరకు సుమారు 60 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ప్రధాన రహదారులు విశాలంగా ఉండడం, రద్దీ ఎక్కువగా లేకపోవడంతో వాహనదారులు వేగంగా వెళుతున్నారు. రోడ్డు మీదకు వచ్చే వన్య ప్రాణులు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడుతున్నాయి. అడపాదడపా వాహనదారులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలున్నాయి. వాహన దారుల వేగానికి అటవీ, పోలీసులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. 

వాహనాలకు స్పీడుకు బ్రేకు వేసేదెప్పుడు..

కవ్వాల టైగర్‌ జోన్‌లో సుమారు 60 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతంలో ప్రధాన రహదారులు విస్తరించి ఉండడంతో ఈ దారి గుండా కేవలం 30 స్పీడు వెళ్లాలన్నా నిబంధనల బోర్డులు ప్రతీ కిలోమీటరుకు ఒకటి  ఏర్పాటు చేశారు. అయినా వాహనదారులు నిబంధనలను పట్టిం చుకోవడం లేదు. అటవీ శాఖ అధికారులు వాహనదారుల వేగాన్ని  నియంత్రించడం లేదు. దీంతో ప్రమాదం జరిగినప్పుడు వాహనదారులు నష్టపోవడమే కాకుండా అటు వన్య ప్రాణుల ప్రాణాలను తీస్తున్నారు. కవ్వాల టైగర్‌జోన్‌లో 30 కిలోమీటర్ల వేగం దాటితే జరిమానా వేసే ప్రక్రియ  కట్టుదిట్టం చేస్తే వాహనాల వేగాన్ని నిరోధించవచ్చని స్ధాని కులు అంటున్నారు. గతంలో అటవీ శాఖ  అధికారులు వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు పోలీసు అధికారుల సమన్వయంతో స్పీడ్‌ గన్‌లను ఏర్పాటు చేస్తామని ప్రతిపాదనలు చేసే యోచనలో ఉన్నారు.  

ఫలితాలు ఇస్తున్న కంచె ఏర్పాటు 

వన్య ప్రాణులు రోడ్డు దాటుతూ ప్రమాదాల బారిన పడుతుండడాన్ని గమనించిన అటవీ శాఖ అధికారులు దారికి ఇరువైపులా ఫెన్సింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు తాళ్లపేట నుంచి మహమ్మదాబాద్‌ ప్రధాన రోడ్డు మీదుగా గేట్‌ నెంబరు 2 వరకు ఫెన్సింగ్‌ (కంచె)ను ఏర్పాటు చేశారు. అదే విధంగా నిర్మల్‌ జిల్లాలోని కొంత భాగం ఇటు ఇందన్‌పల్లి పరిధిలో కొంత ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయడం వల్ల ప్రధాన రహదారిపైకి గతంలో వచ్చిన విధంగా వన్య ప్రాణులు రావడం లేదు.  అడపాదడపా వచ్చే వన్య ప్రాణులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నాయి. పూర్తిగా ఫెన్సింగ్‌ ఏర్పాటు చేస్తే సత్ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నా నిధుల కొరతతో పనులు వెనకబడ్డాయని అధికార వర్గాలు తెలుపుతున్నాయి. 

కవ్వాల టైగర్‌ జోన్‌లోని అటవీ ప్రాంతంలో మూడు సంవత్సరాల నుంచి పోలిస్తే ఈ సంవత్సరం మూడు ప్రమాదాలే జరిగాయని అధికా రులు చెబుతున్నారు. కానీ  వాహనాల అధికవేగం వల్ల వన్య ప్రాణులతో పాటు వాహనదారులకు  ప్రాణనష్టం జరిగే అవకాశాలున్నాయి.

నిబంధనలు పాటించని వారిపై కేసులు 

కవ్వాల టైగర్‌ జోన్‌లో 30 స్పీడ్‌కు మించి వెళితే వారిపై కేసులు పెడతామని అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.  అటవీ ప్రాంతంలో శబ్ద నిరోధకాలు నిరోధించేందుకు చర్యలు చేపడు తున్నారు.  జంతువులు ఇబ్బందులు పడకుండా శబ్దాలను నియంత్రించేం దుకు హారన్‌లు కొట్టకుండా ప్రతిపాదనలు చేస్తున్నారు. ప్రధాన రహదారి వెంట ఎటు పది మీటర్ల దూరంలో ముళ్ల పొదలను తొలగిస్తున్నారు. వన్యప్రాణులు రోడ్డుపైకి వస్తే కనబడేలా ముళ్ల పొదలను, చెట్లను తొలగించడం ద్వారా వాహనాలను నియంత్రించేలా ఏర్పాట్లు చేశారు.  

వాహనదారులకు అవగాహన 

టైగర్‌ జోన్‌లోని ప్రధాన రహదారుల వెంట వెళ్లే వాహనదారులకు అటవీ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. గతంలో నాకాబందీ పేరిట పలు చోట్ల అటవీ శాఖ అధికారులు వాహనాలను ఆపి నెమ్మదిగా వెళ్లాలని సూచించేవారు. ఇటీవల తాళ్లపేట రేంజ్‌లోని తపాలపూర్‌ స్టేజీ వద్ద ప్రధాన రహదారిపై జరిగిన ప్రమాదంలో చుక్కల దుప్పి మృతి చెందడంతో అప్రమత్తమైన అటవీ అధికారులు వాహనదారులకు అవ గాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కార్లకు, భారీ వాహనాలకు, వాహనదారులకు సేవ్‌ ఆనిమల్స్‌ (వన్య ప్రాణులను కాపాడాలంటూ) ప్లకార్డులు పట్టుకుని అటవీ శాఖ సిబ్బంది వాహనం స్పీడుకు 30కి మించకూడదని చెక్‌పోస్టుల వద్ద వాహనదారులకు సూచిస్తున్నారు. 

వాహన వేగం 30 దాటితే చర్యలు

ఎఫ్‌డీవో మాధవరావు 

కవ్వాల అభయారణ్యంలో ప్రధాన రహదారిపై వాహనదారులు 30 స్పీడ్‌ మించితే చర్యలు కఠినంగా ఉంటాయి. అభయారణ్యంలో వన్య ప్రాణులు స్వేచ్ఛగా తిరుగుతాయి. వాటి స్వేచ్ఛకు భంగం కలిగిస్తే అటవీ చట్టం ప్రకారం కేసులు తప్పవు. రానున్న రోజుల్లో వాహన వేగం నియంత్రణకు చర్యలు చేపడతాం.  

Updated Date - 2022-09-19T03:50:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising