ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలి : ఆదివాసీలు
ABN, First Publish Date - 2022-10-03T05:45:04+05:30
ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలం టూ డిమాండ్ చేస్తూ ఆదివారం మండలంలోని గిరిజన గ్రామమైన అం బుగావ్‌లో ఆదివాసీలు ధర్నా నిర్వహించారు. కొమురంభీం విగ్రహం ముం దు మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన గిరిజనులు పెద్దఎత్తున తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు.
తాంసి, అక్టోబరు 2: ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలం టూ డిమాండ్ చేస్తూ ఆదివారం మండలంలోని గిరిజన గ్రామమైన అం బుగావ్‌లో ఆదివాసీలు ధర్నా నిర్వహించారు. కొమురంభీం విగ్రహం ముం దు మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన గిరిజనులు పెద్దఎత్తున తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ సందర్భం గా ప్రభు త్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గ్రామంలో పెద్దఎత్తున ఊరేగింపు నిర్వహించారు. తుడందెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ కార్యక్రమా న్ని నిర్వహించినట్లు తుడందెబ్బ డవిజన్ అధ్యక్షుడు భరత్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంటనే ఎస్టీ జాబితా నుంచి లం బాడీలను తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాము రోజుకో రకమైన ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు తమ గిరిజనుల పై చిన్న చూపు ప్రదర్శిస్తున్నాయని ఆరోపించారు. తాము చేపట్టే ఆందోళనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కొమురంభీం చిత్రపటానికి సమర్పించారు. ఇందులో ఆదివాసీ సంఘం నాయకులు యశ్వంత్, మల్కు పటేల్, సురేష్, సాంబాజి, మాణిక్‌రావు, కేశవరావు, దేవరావు, భీమ్‌రావ్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-03T05:45:04+05:30 IST