లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి
ABN, First Publish Date - 2022-10-08T03:25:14+05:30
లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని శుక్రవారం తుడుందెబ్బ నాయకు లు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. మండల అధ్యక్షుడు ఆత్రం జంగు మాట్లాడుతూ లం బాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, ఆది వాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టా లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కాసిపేట, అక్టోబరు 7: లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని శుక్రవారం తుడుందెబ్బ నాయకు లు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. మండల అధ్యక్షుడు ఆత్రం జంగు మాట్లాడుతూ లం బాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, ఆది వాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టా లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్‌ఐ సులోచనకు వినతిపత్రం అందించారు. మడావి వెంక టేష్, పెంద్రం శంకర్, పెంద్రం ప్రభాకర్, కుర్సెంగ తిరు పతి, అర్జు, రాందాస్, వినోద్, లింగు పాల్గొన్నారు.
తాండూర్: లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తీసివే యాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ నాయకులు తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. మండల అధ్యక్షుడు కుర్సెంగ బాబురావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మండిగ రవీందర్‌లు మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు. రాంచందర్, సమ్మయ్య, వెంకటేష్, అశోక్, శంకర్, జంగు పటేల్, పాల్గొన్నారు.
జన్నారం: లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగిం చాలని తుడుందెబ్బ మండల అధ్యక్షుడు ఆర్‌ఎస్ కాళి తహసీల్దార్‌కు వినతి పత్రం అందించారు. ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వా లని, పీసా చట్టం అమలు చేయా లని డిమాండ్ చేశారు. జంగు పటేల్, వసంత, రామ్‌షా, పాల్గొన్నారు.
దండేపల్లి: లంబాడీ లను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు జంగు తహసీల్దార్ హన్మంతరావుకు వినతిపత్రాన్ని అందజేశా రు. గిరిజన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఏఎన్‌ఎంలను నియమిం చాలన్నారు. సోయం జంగు, లాల్‌శావ్, మోతిరాం, ఓనిరావు, జంగు, భీమయ్య, లచ్చు, పాల్గొన్నారు.
Updated Date - 2022-10-08T03:25:14+05:30 IST