ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనవరి 10 లోగా మున్సిపల్‌ ఉద్యోగాల కోసం వసూలు చేసిన డబ్బులు చెల్లించాలి : బీజేపీ

ABN, First Publish Date - 2022-12-10T01:45:03+05:30

నిర్మల్‌ మున్సిపాలిటీలో ఉద్యోగాల నియామకం కోసం అక్రమంగా వసూలు చేసిన డబ్బులు మంత్రి జనవరి పది లోగా చెల్లించకుంటే 11 నుండి ఉద్యమం చేపడతామని బీజేపీ నా యకులు హెచ్చరించారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌ కల్చరల్‌, డిసెంబరు 9 : నిర్మల్‌ మున్సిపాలిటీలో ఉద్యోగాల నియామకం కోసం అక్రమంగా వసూలు చేసిన డబ్బులు మంత్రి జనవరి పది లోగా చెల్లించకుంటే 11 నుండి ఉద్యమం చేపడతామని బీజేపీ నా యకులు హెచ్చరించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో నాయకులు రావుల రాంనాథ్‌, మేడిసెమ్మె రాజు, మల్లికార్జున్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో బండిసంజయ్‌ చేసిన ప్రజాసంగ్రామయాత్రలో మంత్రి అవినీతిపై చేసిన ఆరోపణలపై సమా ధానం ఇవ్వకుండా దాటవేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్‌ ఉద్యోగ నియామకాల్లో అవినీతి జరిగిందని, దీనిపై 10 లోగా డబ్బుల చెల్లింపుకు బండి డిమాండ్‌ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ గడువులోగా మంత్రి డబ్బులు చెల్లించాలన్నారు. జిల్లాలో మంత్రి బంధు వులు, కుటుంబ సభ్యులు, అనుచరగణం పెద్దఎత్తున అసైన్డ్‌, ప్రభుత్వ భూములను విచ్చలవిడగా కబ్జాచేస్తూ అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్‌భూమిలో పేదలు ఇళ్లు నిర్మించుకుంటే వాటిని తొలగిస్తున్నారు. అదే పెద్దలు నిర్మించుకుంటే వాటి జోలికి పోవడం లేద ని ధ్వజమెత్తారు. భూ ఆక్రమణలకు సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు వాటిని నిరూపిస్తామని అన్నారు. మంత్రికబ్జా చేసిన భూములు పేదలకు పంచే వరకు వదిలి పెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పార్టీ అధ్యక్షుడిపైన, ఎంపీపైన ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని అన్నారు. ప్రజాక్షేత్రంలో న్యాయం తమవైపే ఉందని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు సాగర్‌, నాయుడి మురళి, కౌన్సిలర్‌ నరేందర్‌, సైండ్ల శ్రీధర్‌, తోట సత్యనారాయణ, భట్టు సంతోష్‌రాజు, అనుముల శ్రావణ్‌ తది తరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T01:45:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising