ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైసంపేట్‌, రాంపూర్‌ గ్రామాలకు త్వరలోనే పునరావాసం

ABN, First Publish Date - 2022-10-14T06:11:16+05:30

కడెం మండలంలోని మైసంపేట్‌, రాంపూర్‌ గ్రామా లకు త్వరలోనే పునరావాసం కల్పిస్తామని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ తెలిపారు.

మైసంపేట్‌ గ్రామంలో పర్యటిస్తున్న జిల్లా కలెక్టర్‌, అధికారుల బృందం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖానాపూర్‌, అక్టోబరు 13 : కడెం మండలంలోని మైసంపేట్‌, రాంపూర్‌ గ్రామా లకు త్వరలోనే పునరావాసం కల్పిస్తామని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ తెలిపారు. గురువారం అటవీశాఖ అధికారి సునీల్‌ హిరామత్‌, అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడేలతో కలిసి కలెక్టర్‌ టైగర్‌ జోన్‌ పునరావాస గ్రామాలైన మైసం పేట్‌, రాంపూర్‌ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా రెండు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌కోర్‌ ఏరియాలో ఉన్న రాంపూర్‌, మైసంపేట్‌ గ్రామాలను త్వరలోనే మైదాన ప్రాంతాలకు తరలిస్తామన్నారు. ఇప్పటికే ఈ రెండు గ్రామాల్లోని 142 కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు ఇళ్ల నిర్మా ణం కోసం 12 ఎకరాల భూమి, సాగుభూమి కోసం 207 ఎకరాల భూమిని ఎంపిక చేసినట్లు తెలిపారు. అన్ని మౌలిక సదుపాయాలు సమకూర్చిన తర్వాతనే ఈ రెండు గ్రామాల ప్రజలకు కడెం మండలం పెత్తర్పు సమీపంలో పునరావాసం కల్పిస్తామ న్నారు. వారం రోజుల లోపల చెక్కుల పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. జిల్లా కలెక్టర్‌ గ్రామ ప్రజల పేరిట జాయింట్‌ ఖాతాలను తెరుస్తామన్నారు. జాయింట్‌ ఖా తాలను తెరిచే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని బ్యాంకు అధికారులను ఆదే శించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డీవో కోటేశ్వరరావు, స్థానిక అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-14T06:11:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising