ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్ సంచలన నిర్ణయం

ABN, First Publish Date - 2022-09-15T21:31:15+05:30

నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ (Ambedkar) పేరును పెట్టాలని సీఎం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ (Ambedkar) పేరును పెట్టాలని సీఎం కేసీఆర్ (CM KCR) నిర్ణయించారు. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌కు సీఎం ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ‘‘ తెలంగాణ సెక్రటేరియట్‌ (Telangana Secretariat)కు అంబేద్కర్ పేరును నామకరణం చేయడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం. ఈ నిర్ణయం భారతదేశానికే ఆదర్శం. భారత ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేద్కర్ తాత్వికతను తెలంగాణ ప్రభుత్వం అందిపుచ్చుకుని ముందుకు సాగుతోంది. అంబేద్కర్ కలలుగన్న భారతదేశంలో భిన్నత్వంతో కూడిన ప్రత్యేక ప్రజాస్వామిక లక్షణం ఉంది. ఫెడరల్ స్ఫూర్తిని అమలు చేయడం ద్వారా మాత్రమే అన్ని వర్గాలకు సమాన హక్కులు అవకాశాలు కల్పించబడుతాయనే అంబేద్కర్ స్ఫూర్తి మమ్మల్ని నడిపిస్తోంది. దేశ ప్రజలు కుల, మత, లింగ, ప్రాంతాల వివక్ష లేకుండా అన్ని వర్గాలు సమానంగా గౌరవించబడి, అందరికీ సమాన అవకాశాలు కల్పించబడడమే నిజమైన భారతీయత. భారత నూతన పార్లమెంటు భవనానికి కూడా అంబేద్కర్ పేరును పెట్టాలని ఏదో ఆశామాషీకి కోరుకున్నది కాదు. భారతదేశ గౌరవం మరింతగా ఇనుమడించబడాలంటే, అంబేద్కర్ పేరును మించిన పేరు లేదనే విషయాన్ని ఇటీవలే అసెంబ్లీ (Assembly) సాక్షిగా ప్రకటించాం. అందుకు సంబంధించిన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఇదే విషయమై నేను ప్రధాని మోదీకి త్వరలో స్వయంగా లేఖ పంపుతాను. తెలంగాణ ప్రభుత్వ డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుని నూతనంగా నిర్మిస్తున్న భారత పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరును పెట్టాలని నీను మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నాను’’ అని కేసీఆర్ ప్రకటించారు. 


ఢిల్లీలో నూత‌నంగా నిర్మించిన పార్ల‌మెంటు భ‌వ‌నానికి అంబేద్క‌ర్ పేరు పెట్టాలంటూ ప‌లు పార్టీలు, ఉద్యమకారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే అంశంపై తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసింది. అయితే కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ క్రమంలోనే తెలంగాణ నూత‌న స‌చివాల‌యానికి అంబేద్క‌ర్ పేరు పెడుతూ కేసీఆర్ నిర్ణ‌యం తీసుకోవడం గమనార్హం.

Updated Date - 2022-09-15T21:31:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising