ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమలలో అన్నమయ్య గృహాన్ని నిర్మించాలి

ABN, First Publish Date - 2022-11-05T23:57:50+05:30

తిరుమల కొండపై కూల్చిన వాగ్గేయకారుడు అన్నమయ్య గృహాన్ని యధాతథంగా నిర్మించాలని అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయ శంకర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిని డిమాండ్‌ చేశారు. తిరుమలకొండపై అన్నమయ్య గృహం, ఆంజనేయ స్వామి విగ్రహం పునర్‌ ప్రతిష్ఠించేవరకూ పోరాటం చేస్తామన్నారు. తిరుమల కొండపై సమతా ఆధ్యాత్మికమూర్తి అన్నమయ్య గృహాన్ని తక్షణమే నిర్మించాలనే డిమాండ్‌ తో చేపట్టిన సంతకాల సేకరణ, గృహ సాధన చైతన్య రథ యాత్ర శనివారం నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి చేరింది.

చెర్వుగట్టులో పూజల్లో పాల్గొన్న విజయ శంకర స్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నార్కట్‌పల్లి, నవంబరు 5: తిరుమల కొండపై కూల్చిన వాగ్గేయకారుడు అన్నమయ్య గృహాన్ని యధాతథంగా నిర్మించాలని అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయ శంకర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిని డిమాండ్‌ చేశారు. తిరుమలకొండపై అన్నమయ్య గృహం, ఆంజనేయ స్వామి విగ్రహం పునర్‌ ప్రతిష్ఠించేవరకూ పోరాటం చేస్తామన్నారు. తిరుమల కొండపై సమతా ఆధ్యాత్మికమూర్తి అన్నమయ్య గృహాన్ని తక్షణమే నిర్మించాలనే డిమాండ్‌ తో చేపట్టిన సంతకాల సేకరణ, గృహ సాధన చైతన్య రథ యాత్ర శనివారం నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి చేరింది. డప్పు కళాకారుల నృత్యాలతో క్షేత్రానికి చేరుకున్న స్వామీజి కి, యాత్ర బృందానికి ఆలయ అర్చకకులు మర్యాదపూర్వక స్వాగతం పలికారు. అనంతరం లక్షా యాభైవేల సంతకాల సేకరణకు సంబంధించిన పత్రాలకు రామలింగేశ్వరుని మూలవిరాట్టు వద్ద ప్రత్యేకపూజలు చేయించారు. ఈ సందర్భంగా విజయ శంకర స్వామి మాట్లాడుతూ 2003లో తిరుమల కొండపై కూల్చేసిన సమతామూర్తి అన్నమయ్య గృహంతోపాటు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనే డిమాండ్‌తో జైభారత్‌ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన 11లక్షల సంతకాల సేకరణలో సంస్థ కార్యకర్తల కృషి అభినందనీయమన్నారు. అన్నమయ్య గృహ సాధన ఉద్యమాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోన్ని పల్లెపల్లెకూ తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో అన్నమయ్య గృహ సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరన్న, జైభారత్‌ జాతీయ కార్యదర్శి గోల సత్యనారాయణ, జానపద వృత్తి కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కుమ్మరి శంకర్‌, గుండు వెంకన్న, ఇమ్మయ్య, రాఘవదా స్‌,కృష్ణవేణి, లావణ్య, ఆమనగంటి అయిలయ్య, విజయ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-05T23:57:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising