ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Raja Singh బయటకు వస్తే లా ఆర్డర్ సమస్య- అడ్వకేట్ జనరల్

ABN, First Publish Date - 2022-11-08T18:33:12+05:30

హైదరాబాద్: రాజాసింగ్ జైలు నుంచి బయటకు వస్తే లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశం ఉందని అడ్వకేట్ జనరల్ బిస్ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు.

MLA Raja Singh
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాజాసింగ్ జైలు నుంచి బయటకు వస్తే లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశం ఉందని అడ్వకేట్ జనరల్ బిస్ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్‌ విధించడంపై హైకోర్టులో వాదనలు సుదీర్ఘంగా కొనసాగాయి. రాజాసింగ్ ఓ వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడని, ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఇప్పటికే 101 కేసులు ఉన్నాయని, అందులో18 కేసులు మత విద్వేషాలు రెచ్చ గొట్టేలా చేసిన కేసులు ఉన్నాయని కోర్టుకు వివరించారు. ఈ సమయంలో రాజసింగ్ బయటికి వస్తే లా ఆర్డర్ సమస్య తలెత్తుతుందన్నారు. గతంలో రాజసింగ్ చేసిన వ్యాఖ్యలతో హైదరాబాద్‌లో ఓ వర్గం వారు నిరసనలు తెలియజేశారని ఏజీ హైకోర్టుకు గుర్తు చేశారు. ఎమ్మెల్యే రాజసింగ్ పై పీడీ యాక్ట్ పెట్టడం సరైనదేనని అడ్వకేట్ జనరల్ బిస్ ప్రసాద్ వాదించారు.

మరోవైపు ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది రవి చందర్ వాదించారు. రాజాసింగ్ ఏ మతాన్నీ కించపరిచలేదని, ఏ మతాన్ని టార్గెట్ చేయలేదని వివరించారు. కేవలం బాల్య వివాహం అనే ఒక నాటకాన్ని మాత్రమే ప్రజెంట్ చేసాడని చెప్పారు. మహమ్మద్ ప్రవక్త అనే పదాన్ని ఎక్కడ కూడా రాజాసింగ్ ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. రాజకీయ కక్ష తోనే రాజాసింగ్‌పై పిడి యాక్ట్ నమోదు చేశారని చెప్పారు. నాంపల్లి కోర్టు రీమాండ్ చెల్లదని రిజెక్ట్ చేసిందని, అందుకే పీడీ యాక్ట్‌ను పోలీసులు నమోదు చేశారని రవి చందర్ కోర్టుకు తెలిపారు.

మరోవైపు ఏజీ వాదనలకు కౌంటర్‌గా బుధవారం కూడా పిటిషనర్ తరపు న్యాయవాది రవి చందర్ వాదనలు వినిపించనున్నారు. తదుపరి విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది

Updated Date - 2022-11-09T16:28:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising