ఉగాండా జాతీయ ఫుట్‌బాలర్‌కు.. యశోద ఆస్పత్రిలో ‘గుండె’ పరికరం
ABN, First Publish Date - 2022-02-11T08:30:48+05:30
గుండె సమస్యతో బాధపడుతున్న ఉగాండా ఫుట్‌బాల్ జట్టులో అదనపు ఆటగాడు ఓక్వారా జోసెఫ్‌కు యశోద ఆస్పత్రిలో వెంట్రిక్యులర్ ఆసిస్ట్ డివైజ్ సిస్టమ్(ఎల్‌వీఏడీ)ను...
విజయవంతంగా ఎల్‌వీఏడీని అమర్చిన వైద్యులు
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): గుండె సమస్యతో బాధపడుతున్న ఉగాండా ఫుట్‌బాల్ జట్టులో అదనపు ఆటగాడు ఓక్వారా జోసెఫ్‌కు యశోద ఆస్పత్రిలో వెంట్రిక్యులర్ ఆసిస్ట్ డివైజ్ సిస్టమ్(ఎల్‌వీఏడీ)ను అమర్చారు. జోసెఫ్ గత ఏప్రిల్‌లో ఫుట్‌బాల్ ఆడుతుండగా ఛాతీ ఎడమ భాగంలో తీవ్ర నొప్పి వచ్చింది. అతడు ఇస్కీమిక్ కార్డియోమయోపతితో బాధపడుతున్నట్లు డాక్టర్లు గుర్తించారు. పొత్తికడుపులో వాపు, ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోవడం వంటి సమస్యలు ఉన్నట్లు నిర్ధారించారు. నవంబరులో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. జోసెఫ్‌కు డిసెంబరు 24న ‘జార్విక్ 200 ఎల్‌వీఏడీ సిస్టం’ను అమర్చారు. ఇది గుండెమార్పిడికి సహకరిస్తుంది. దీర్ఘకాలికంగా గుండె వైఫల్యం ఉన్న వారికి డెస్టినేషన్ థెరపీగా ఉపయోగపడుతుందని సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు, ఎలకో్ట్ర ఫిజియాలజిస్ట్ డాక్టర్ వి.రాజశేఖర్ తెలిపారు. కొన్ని రకాల వ్యాధుల కారణంగా దెబ్బతిన్న గుండె కొట్టుకోవడంలో విపరీతమైన నెమ్మది ఏర్పడి.. అది ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని యశోద ఆస్పత్రుల డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి వివరించారు. మన దేశంలో 3 కోట్ల మందికిపైగా హృద్రోగులుండగా, 45 లక్షల మంది రోగుల్లో గుండె వైఫల్యం ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయన్నారు.
Updated Date - 2022-02-11T08:30:48+05:30 IST