ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BRS: టీఆర్‌ఎస్‌ఎల్పీ పేరు బీఆర్‌ఎస్‌ఎల్పీగా మార్పు

ABN, First Publish Date - 2022-12-22T19:08:22+05:30

టీఆర్‌ఎస్‌ఎల్పీ (TRSLP) పేరు బీఆర్‌ఎస్‌ఎల్పీ (BRSLP)గా మార్చారు. బీఆర్‌ఎస్‌ఎల్పీగా పేరు మారుస్తూ అసెంబ్లీ బులెటిన్ విడుదల చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ఎల్పీ (TRSLP) పేరు బీఆర్‌ఎస్‌ఎల్పీ (BRSLP)గా మార్చారు. బీఆర్‌ఎస్‌ఎల్పీగా పేరు మారుస్తూ అసెంబ్లీ బులెటిన్ విడుదల చేశారు. ఇకపై అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలుగా గులాబీ పార్టీ సభ్యులు మారనున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ.. భారత రాష్ట్ర సమితిగా మారిన విషయం తెలిసిందే. తెలంగాణ పరిధి నుంచి జాతీయ స్థాయి పార్టీగా రూపాంతరం చెందింది. ఉద్యమ పార్టీ నుంచి ప్రాంతీయ పార్టీ అధినేతగా మొదలైన కేసీఆర్‌ (KCR) ప్రస్థానం జాతీయ పార్టీ అధ్యక్షుడి స్థాయికి చేరారు. టీఆర్ఎస్, బీఆర్ఎస్గా మారింది. ఇదే విషయాన్ని ఎన్నికల కమిషన్ ధ్రువీకరించింది. టీఆర్ఎస్ (TRS)ను బీఆర్ఎస్గా మారుస్తూ ఈసీ ఆమోదం తెలిపింది. మరోవైపు బీఆర్‌ఎస్‌తో జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టిన సీఎం కేసీఆర్‌.. పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరింపజేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా తొలిదశలో ఆరు రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాలు చేపట్టాలని నిర్ణయించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటక సహా సాధారణ ఎన్నికలతోపాటు జరిగే ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌, హరియాణా, మహారాష్ట్ర, ఒడిసా రాష్ట్రాల్లో ముందుగా పాగా వేసే ప్రయత్నాల్లో ఉన్నారు.

Updated Date - 2022-12-22T19:08:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising