ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Siddipet: చేర్యాల జడ్పీటీసీ దారుణ హత్య

ABN, First Publish Date - 2022-12-26T19:48:10+05:30

సిద్దిపేట జిల్లా (Siddipet District) జనగామ నియోజకవర్గం చేర్యాల మండల జడ్పీటీసీ శెట్టె మల్లేశం(43) సోమవారం తెల్లవారుజామున గ్రామశివారులో దారుణ హత్యకు గురయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేర్యాల: సిద్దిపేట జిల్లా (Siddipet District) జనగామ నియోజకవర్గం చేర్యాల మండల జడ్పీటీసీ శెట్టె మల్లేశం(43) సోమవారం తెల్లవారుజామున గ్రామశివారులో దారుణ హత్యకు గురయ్యారు. ఒంటరిగా మార్నింగ్‌ వాకింగ్‌కు వెళ్లిన మల్లేశంను వెనక నుంచి తలపై మారణాయుధంతో బాది హత్య చేశారు. గమనించిన స్థానికులు సిద్దిపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం ఉన్నతాస్పత్రికి తీసుకెళ్లమని వైద్యులు చెప్పారు. దీంతో సికింద్రాబాద్‌ (Secunderabad)లోని యశోద ఆస్పత్రిలో చేర్పించగా, మార్గమధ్యలోనే చనిపోయాడని నిర్ధారించారు. విషయం తెలిసిన ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) దిగ్ర్భాంతికి లోనయ్యారు. నిందితులను పట్టుకోవాలని సిద్దిపేట సీపీ శ్వేతను ఆదేశించారు. కాగా హత్యకు పాల్పడిన నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. వ్యక్తిగత, భూ, కుల సంఘ వివాదాలు, రాజకీయ విబేధాల కారణంగా గ్రామానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి హత్య చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఉపాధిహామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ నుంచి జడ్పీటీసీగా ఎదిగిన మల్లేశం మృతిపట్ల గ్రామంలో విషాదం అలముకున్నది. ఆదివారం తన బాల్యమిత్రులతో కలిసి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం వరకు ఉల్లాసంగా గడిపిన మల్లేశం కొన్నిగంటలకే అనంతలోకానికి చేరడంతో తీరని విషాదంలో ముగినిపోయారు.

Updated Date - 2022-12-26T19:48:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising